how to use besan for glowing face

ఎంత నల్లని ముఖం అయినా సెనగపిండిలో కలిపి మొహానికి రాస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది

మనలో చాలా మంది ముఖం పై  నలుపు రావడం,  జిడ్డు, మురికి పేరుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్  ఉపయోగిస్తున్నారు.ఇటువంటి ప్రొడక్ట్స్ లో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి  చర్మానికి హాని కలిగిస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా చర్మంపై ఉండే నలుపు, జిడ్డు, మురికి పోగొట్టుకోవచ్చు. దీని కోసం మన వంటగదిలో వాడే పదార్దాలు ఉపయోగిస్తే సరిపోతుంది. 

     మార్కెట్ నుండి  కెమికల్స్ ఉండే పదార్థాలు ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల శెనగపిండి వేసుకోవాలి. సెనగపిండి చర్మం తెల్లగా మెరిసి పోవడానికి సహాయపడుతుంది. ముఖం పై  జిడ్డు, మురికి పోగొట్టడంలో సహాయపడుతుంది. తర్వాత దీనిలో  పావు చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి.  కాఫీ పౌడర్ స్కిన్ వైట్ గా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. స్కిన్  లైటేన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాఫీ పౌడర్ వద్దు అనుకున్న వారు  పసుపు కూడా వేసుకోవచ్చు. 

     తర్వాత అందులో ఒక చెంచా పచ్చి పాలు వేసుకోవాలి.  పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. ముఖంపై ఉండే ఓపెన్  ఫోర్స్ ను క్లోజ్ చేయడంలో కూడా ఉపయోగపడతాయి. తర్వాత దీనిని ఒక చెంచా అలోవెరా జెల్  వేసుకోవాలి. అలోవెరా జెల్ చర్మ పీహెచ్ ను   లెవెల్ చేయడంలో సహాయపడుతుంది. చర్మం   మాయిశ్చరైజ్ చేసి  మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. తర్వాత దీనిలో రెండు లేదా మూడు చుక్కలు నెయ్యిని వేసుకోవాలి. 

         నెయ్యి చర్మంపై ఉండే  డార్క్ సర్కిల్స్  ,  నల్లటి మచ్చలు వంటి వాటిని తగ్గిస్తుంది.  చర్మం తెల్లగా మారడంలో ఉపయోగపడుతుంది.  ఎటువంటి స్కిన్  టైప్ వారైనా సరే నెయ్యి  ఉపయోగించవచ్చు. వీటన్నిటిని  బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత గంట వరకు సబ్బులు చేయకూడదు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం పై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. 

      ఏమి ఉపయోగించిన  రంగు మారని  వారు ఈ చిట్కా ట్రై  చేసినట్లయితే తెల్లగా మెరిసిపోతారు. ఈ చిట్కా ముఖం పై అద్భుతంగా పనిచేస్తుంది.   మంచి రిజల్ట్ ఉంటుంది.  పార్లర్ కి వెళ్లి గంటల కొద్దీ కూర్చుని సమయం మరియు డబ్బులు వృధా చేసుకోవడం కంటే ఇంట్లోనే ఉండి ఈ చిట్కా చేసినట్లైతే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

Leave a Comment

error: Content is protected !!