HOW TO USE CLOVES FOR HAIR GROWTH

ఇది మీ జుట్టుకు రాస్తే చాలు. మీ జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది

చలికాలం వస్తే చాలు చాలా మందికి చర్మం పొడిబారి పోతుంది. అలాగే జుట్టులోని చర్మం కూడా పొడిబారి చుండ్రు సమస్య అధికమవుతుంది. వీటికి మనం నిమ్మకాయ వంటి అనేక రకాల చిట్కాలు పాటించినా ఫలితం లేనప్పుడు కెమికల్స్ తో నిండిన షాంపూలు మందులు ఉపయోగించినా తగ్గనప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిట్కా తప్పకుండా ఉపయోగించండి. చుండ్రు పొరల్లా లేస్తూ దురద  చికాకును కలిగిస్తుంది. వీటిని సహజ మార్గంలో తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం జుట్టు మూలాలకు పూసినప్పుడు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఇది క్రమం తప్పకుండా అప్లైజేసినప్పుడు జుట్టు షాఫ్ట్‌కు రిపేర్ చేయడం, బలోపేతం చేయడం మరియు ఆరోగ్యకరమైన షైన్‌ను కూడా జోడించగలదు.   ఇది జుట్టు కుదుళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరిచి మరియు బలమైన అందమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. లవంగం నూనెలోని యాంటీఆక్సిడెంట్లు స్కాల్ప్‌లో సర్క్యులేషన్‌ను పెంచడంలో సహాయపడతాయి మరియు కొత్త ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి పని చేస్తాయి.  యూజినాల్ మీ జుట్టు యొక్క సహజ నలుపు రంగును కూడా రిఫ్రెష్ చేస్తుంది మరియు పెంచుతుంది. ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు లవంగాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక గ్లాసు నీటిని గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల లవంగాలను వేసుకోవాలి. ఈ నీటిని బాగా మరిగేంతవరకు స్టవ్పై ఉంచుకోవాలి. నీళ్లు బాగా మరిగి  రంగుమారిన తరువాత స్టవ్ ఆపేసి ఒక రాత్రంతా ఈ నీటిని అలాగే వదిలేయాలి. మరుసటి రోజు నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఈ నీటిని జుట్టుకు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు లవంగం నీటిని తలకు ఉపయోగించడం వలన జుట్టులో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. జుట్టు సమస్యల నుండి నివారణ లభిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. జుట్టు రాలడం చుండ్రు సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.

Leave a Comment

error: Content is protected !!