ప్రపంచంలో అధికంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడమే వాతావరణ పరిస్థితులు అనారోగ్య సమస్యలు జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణాలుగా ఉంటాయి. మన సమస్య ఏమిటో గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలు ప్రొటీన్ అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటూ జుట్టుపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి చికిత్స చేయడం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. దానితోపాటు ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలను పాటించడం వలన జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.
దీనికోసం మనకు రెండు వంటగదిలో ఉండే పదార్ధాలు కావాలి. మొదట మనకు కావలసిన పదార్థం మెంతులు. మెంతులు జుట్టు స్మూత్‌గా షైనిగా చేస్తుందని మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మెంతులు చుండ్రు సమస్య, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతి గింజలలో ఐరన్ మరియు ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు రెండు ముఖ్యమైన పోషకాలు. అవి ఫ్లేవనాయిడ్లు మరియు సపోనిన్లతో సహా మొక్కల సమ్మేళనాల యొక్క ప్రత్యేకమైన కూర్పును కూడా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ కారణంగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
తర్వాత పదార్ధం కలోంజి విత్తనాలు. కలోంజి విత్తనాలు నల్లజీలకర్ర మధ్య పోలిక తెలియక ఇబ్బంది పడుతుంటారు. నల్లజీలకర్ర గోధుమ వర్ణంలో పొడవుగా ఉంటుంది. కలోంజి విత్తనాలు నల్ల నువ్వులను పోలి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతాయి. కలోంజిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి, ఇవి మీ స్కాల్ప్ నుండి చికాకును తగ్గిస్తాయి. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ చుండ్రు మరియు ఇతర జుట్టు సమస్యలకు దారితీస్తుంది, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. బ్లాక్ సీడ్ ఆయిల్లో ఒమేగా 3 ఉంటుంది మరియు ఇది రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.
ఇది జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ మెంతులు, ఒక రెండు టీ స్పూన్ల కలోంజి విత్తనాలు వేసుకుని ఒక గ్లాస్ నీటిని వేయాలి. ఈ నీళ్లు అర గ్లాసు అయ్యేంత వరకు బాగా మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీరు చల్లారిన తరువాత వడగట్టి ఒక స్ప్రే బాటిల్లో తీసుకోవాలి. ఈ నీటిని స్కాల్ఫ్కు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వస్తుంది.