మారిపోయిన జీవనశైలి తో పాటు మనుషుల ఆరోగ్యం విషయంలో కూడా పెనుమార్పులు వచ్చాయి.ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా షుగర్ లేదా కీళ్ళు కాళ్ళనొప్పులు తో బాధపడుతున్నారు. దానికి ఇంగ్లీషు మందులు వాడి మరిన్ని దుష్ప్రభావాలతో బాధపడడానికి ముందు ఈ చిట్కాలు ఒకసారి ప్రయత్నించి చూడండి. వీటిని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. అదేంటంటే జిల్లేడు. జిల్లేడులో మూడు రకాల జాతులు ఉంటాయి. ఒకటి ఎర్ర జిల్లేడు, రాజజిల్లేడు, మరియు తెల్ల జిల్లేడు. రోడ్లపక్కన, పొలంలో, పల్లెల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలు కనిపిస్తుంటాయి.
జిల్లేడు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానినుండి వచ్చే పాలు చాలా ప్రమాదకరం. అవి కంట్లోపడితే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. తీవ్రమైన భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ విరేచనాలు, మలబద్ధకం మరియు కడుపు పూతలతో సహా జీర్ణ రుగ్మతలకు తెల్లజిల్లెడు ఉపయోగించబడుతుంది. పంటి నొప్పి, తిమ్మిరి మరియు కీళ్ల నొప్పులతో సహా చక్కెర వ్యాధులను తగ్గిస్తుంది.
దీనికోసం జిల్లేడు ఆకులను పాలు కంట్లో పడకుండా జాగ్రత్తగా సేకరించి నీటితో కడగాలి. సేకరించిన తర్వాత కూడా చేతులను కళ్ళకు,ముఖానికి తగలకుండా జాగ్రత్త పడుతూ సబ్బుతో కడుక్కోవాలి. తర్వాత పడుకునేముందు లేదా ఉదయం లేచాక ఈ ఆకులను అరికాళ్ళకు దారంతో కట్టడం వలన చక్కెర వ్యాధి అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అలాగే కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ ఆకులకు గోరువెచ్చని ఆవనూనె లేదా నువ్వులనూనె రాసి నొప్పి ఉన్నచోట పరిశుభ్రంగా ఉన్న గుడ్డ సాయంతో కట్టడంవలన కీళ్ళు, కాళ్ళనొప్పులు తగ్గుతాయి. ఉదయం లేచిన తర్వాత ఆకులను తొలగించవచ్చు. దీనికోసం రోజూ కొత్త ఆకులను ఉపయోగించాలి. మరియు తెల్లజిల్లేడు మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో సిఫిలిస్, చెవిదిమ్మలువేయడం, శరీరంలో మంట (వాపు), మూర్ఛ, హిస్టీరియా, జ్వరం, కండరాల నొప్పులు, మొటిమలు, కుష్టు వ్యాధి, గౌట్ సమస్యలు, పాముకాటు మరియు క్యాన్సర్ చికిత్సకోసం ఈ తెల్లజిల్లెడు చెట్టును ఉపయోగిస్తారు.
Naku kanti puthaa vachi 5yers aindhi dhani tholaginchadam elaa saar
Hi sir, I need a help from you how to use thelajiladu leaves or plant for fits, kindly inform me as early as possible, am suffering from it since last 10 years using alopathic medicines sir