ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరికి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా హాస్పిటల్స్ తిరిగి రకరకాల మందులు ఉపయోగిస్తున్నారు. కానీ ఇంగ్లీష్ మందులు ఉపయోగించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇంట్లో తయారు చేసిన ఈ ఆయిల్ ఉపయోగించినట్లయితే అన్ని రకాల నొప్పులను తగ్గించుకోవచ్చు.
దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ నూనె తయారుచేసుకోవడానికి మన వంటింట్లో ఉండే వాటిని ఉపయోగిస్తే సరిపోతుంది. దీనికోసం ముందుగా లవంగాలను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా లవంగాల పొడిని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఐదు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనిలో 50 గ్రాముల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి నీళ్ళు వేసి బాగా మరగనివ్వాలి.
మరిగిన తర్వాత దానిలో ఒక కాటన్ క్లాత్ పెట్టి మధ్యలో మనం తయారుచేసుకున్న నూనె పెట్టి 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నూనెను వడకట్టుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ ను నూనె ప్రతిరోజు అప్లై చేసుకోవాలి. ఈ నూనెను అప్లై చేయడం వలన నొప్పి ఉన్న భాగంలో నొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ నూనె డైరెక్ట్ గా మరిగించకూడదు. డైరెక్ట్ గా మరగ పెట్టడం వల్ల దానిలో ఉండే పోషకాలు పోతాయి.
ఇలా డబల్ బాయిలర్ పద్ధతిలో మాత్రమే మరిగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి ముందు మెడ నొప్పి, మోచేతి నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్లు నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి ఉన్నటువంటి భాగాల్లో ఈ నూనె గోరువెచ్చగా చేసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయానికి నొప్పులన్నీ తగ్గిపోతాయి. రకరకాల ఇంగ్లీష్ మందులను ఉపయోగించినప్పటికీ నొప్పి నుండి ఉపశమనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ నూనెను అప్లై చేసి చూడండి. ఈ నూనె ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది.