బరువు తగ్గాలి అనుకొని కఠినమైన డైట్ లు, వ్యాయామం చేయలేక మధ్యలోనే విరమించుకుంటున్నారా. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ పద్ధతి పాటించి చూడండి. ఇది శరీరంలో కొవ్వును కరిగించడంతో పాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని కోసం మనం చేయవలసిందల్లా ఏకభుక్తం వ్రతం. అదేం వ్రతం అనుకుంటున్నారా? మన పూర్వ కాలం నుండి పూజలు, వ్రతాలు చేసే సమయంలో చేసే ఏక పొద్దు. ఏక పొద్దు అంటే మనం పూర్వ కాలంలో పెద్దలకు సమయం చెప్పడానికి పొద్దుపొడవడం వంటివాటిని బట్టి లెక్క చెప్పేవారు.
అలాగే ఒక్క పూట మాత్రమే భోజనం చేయడాన్ని ఏక పొద్దు అనేవారు. అవును ఒక్కపూట మాత్రమే భోజనం చేయడాన్ని ఏక భుక్త వ్రతం అంటారు. మనకి కార్తీక మాసం లేదా ఇతర పవిత్రమైన మాసాల్లో ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు. ఇలా ఒక నెల చేయడం వలన శరీర అవసరాలకు కావాల్సిన శక్తి కోసం శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలను శరీరం వాడుకోవడం మొదలుపెడుతుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారు శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి సహజంగా బరువు తగ్గుతారు.
దీనికోసం ఉదయం లేచిన వెంటనే నీటిని తాగాలి. మళ్లీ 9, 10 గంటలకు ఒకసారి ఇంకొక లీటరు నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో ఉన్న విష వ్యర్థాలు బయటకు పోయి విరోచనం కూడా సులభంగా అవుతుంది. 11 గంటలకు ఒక గ్లాసు పండ్లరసం ఏదైనా తీసుకోవాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. 12:30, 1:00 కు మీకు నచ్చిన ఆహారం ఏదైనా కడుపునిండా తినొచ్చు. ఈ సమయంలోనే మీకు కావలసిన స్వీటు, హాటు స్నాక్స్ ఏదైనా సరే తీసుకోవచ్చు. మళ్ళీ రెండు గంటల వరకు నీటిని కూడా తాగకూడదు.
రెండు గంటల తరువాత అరగంట విరామం ఇస్తూ ఒక్కో గ్లాసు చొప్పున ఐదు గ్లాసుల నీటిని తాగుతూ ఉండాలి. మళ్లీ మరుసటి రోజు రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా కనీసం నెల చేయడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కరిగిపోతుంది. రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఇలా నెలమాత్రమే చెయ్యాలి. అంతకుమించి చేయడంవల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒక్క పూట భోజనంతో అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.