how to whiten intimate areas naturally

కేవలం 15 నిమిషాల్లో మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నల్లదనం పోయి తెల్లగా మారుతుంది

శరీరంలో ప్రైవేట్ బాడీ పార్ట్స్, బాహుమూలల్లో, మరియు తొడల దగ్గర చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. అలాంటి చోట్ల చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి ప్రొడక్ట్స్ కూడా ఏమీ అందుబాటులో ఉండవు. దీనికి ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వలన అలాంటి చర్మం ఉన్నవారు సులువుగా చర్మాన్ని  తెల్లగా మార్చుకోవచ్చు. దానికోసం మనం ఇంట్లో ఉండే పదార్థాలుతో రెండు భాగాలుగా ఈ చిట్కాను పాటించవలసి ఉంటుంది. 

మొదటి స్టెప్ కోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఎక్కడైతే నల్లగా ఉందో ఆ చర్మాన్ని నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం కొద్దిగా రంగు మారుతుంది. దీనిపై సెకండ్ స్టప్ ఫాలో అవ్వాలి. దానికోసం ఒక టమాటాను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఒక స్పూన్ గోధుమపిండి కూడా వేసుకోవాలి.

 ఈ మూడింటిని బాగా కలిపి నల్లటి చర్మం ఉన్నచోట ప్యాక్ లా వేయాలి. తర్వాత  20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కనీసం ఒక వారం రోజులు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే చర్మం రంగు మారడాన్ని గమనిస్తారు. ఇందులో వాడిన పదార్థాలు సహజమైనవి మరియు బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి చర్మాన్ని తెల్లగా చేయడంలో సహాయపడేవి. వీటితో పాటు  కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చర్మం నల్లగా కాకుండా కాపాడుకోవచ్చు.

 బాహుమూలల్లో వచ్చే అవాంఛిత రోమాలు రేజర్తో కాకుండా వ్యాక్సింగ్ ద్వారా రిమూవ్ చేయడం వల్ల చర్మం నల్లగా కాకుండా అడ్డుకోవచ్చు.  తర్వాత టైట్ గా ఉండే బట్టలు ధరించడం వలన అక్కడి చర్మానికి సరైన గాలి తగలక, చెమటకు చర్మం నల్లగా మారుతుంది. అలాగే ఎక్కువగా బరువు తగ్గినా లేదా ఎండకు ఉండే వారికైనా ఇలా చర్మం నల్లగా మారుతుంది. ఇందులో మీ సమస్య ఏంటో గమనించి పరిష్కరించడం వల్ల చర్మం నల్లగా మారకుండా కాపాడుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!