చాలామందిలో పళ్ళు పసుపు పచ్చగా మారడం, గార పట్టడం జరుగుతుంది. కొంతమందికి రాత్రి సమయంలో బ్రెష్ చేసే అలవాటు లేకపోవడం వలన పళ్ళు రంగు మారడం, గార గారపట్టడం జరుగుతుంది. కొంతమంది పాన్, గుట్కా వంటివి నమలడం వలన కూడా పళ్ళు గారపట్టడం, నోటి దుర్వాసన సమస్య వస్తుంది. మనం జాగ్రత్తగా పళ్ళు మొత్తం శుభ్రం అయ్యే విధంగా బ్రెష్ చేసినట్లయితే దంతక్షయం. పళ్ళు తెల్లగా రావడం కోసం రకరకాల టూత్ పేస్ట్ లను ఉపయోగించకూడదు.
పళ్ళు శుభ్రం అయ్యే విధంగా పైకి లోపలికి వెళ్ళే విధంగా జిగ్జాగ్ గా ఉండే బ్రష్ ఉపయోగించాలి. చల్లవి లేక వేడివి తాగినప్పుడు పళ్ళు జివ్వుమని అంటే వాళ్లు ఆంటీసెన్సిటివ్ టూత్ పేస్ట్ ఉపయోగించాలి. చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు ఒకే రకమైన బ్రెష్ ఉపయోగించకూడదు. పిల్లల పాల దంతాలు కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటాయి. వాళ్ళ కోసం స్మూత్ గా ఉండే బ్రెష్ లను ఉపయోగించాలి. స్వీట్స్, చాకోలెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తీపి పదార్దాలకు దూరంగా ఉండాలి.
రాత్రి తిన్న తర్వాత బ్రెష్ చేయడం అలవాటు చేసుకోవాలి.పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం వెంటనే క్లీన్ చేసుకోవాలి. సిట్రస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సిట్రస్ ఫుడ్స్ పళ్లకు హాని కలిగిస్తాయి. ఒకవేళ సిట్రస్ ఫుడ్స్ ఏమైనా తిన్నట్లయితే నోరు పుక్కలించాలి. పంటి నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చటి ఉప్పు నీళ్లతో పుక్కలించడం వలన తగ్గుతుంది. మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నోట్లో పాచి కూడా తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బ్రష్లను మార్చాలి. బ్రష్ చేసిన తర్వాత బ్రష్ గాలికి ఆరే విధంగా పెట్టాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ చిట్కాలను ట్రై చేసినట్లయితే పళ్లపై ఉండే గార, పచ్చదనం పోతాయి. పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతో పళ్లపై ఒకసారి రుద్ది నోట్లో నీళ్ళు వేసి పుక్కలించినట్లయితే తర్వాత మామూలు టూత్ పేస్ట్ తో బ్రెష్ చేయడంవల్ల పళ్ళ పై ఉన్న గార పోతుంది. ఒక చెంచా జీలకర్ర పొడి అర చెంచా బేకింగ్ సోడా అర చెంచా నిమ్మరసం కొంచెం నీళ్ళు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రెష్ తో పళ్ళ పై రుద్ది ఒక పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి.
తరువాత నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించడం వల్ల పళ్లపై ఉండే గార, పసుపు పచ్చదనం పోతాయి. గ్లాస్ నీటిలో పావు చెంచా పసుపు వేసి కలిపి ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అరచెంచా, పసుపు అరచెంచా వెన్నెల ఎసెన్స్ కలిపి మిశ్రమం వలన చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన, గారపట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి.