How To Whiten Teeth At Home Plaque removal tips

మీ పంటి పై గార పోయి మీ పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

హలో ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిన విషయమే ప్రతి రోజూ పళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఖచ్చితంగా బ్రష్ చేయాలి. దీనివల్ల మన పళ్ళు పసుపు పచ్చగా మారకుండా శుభ్రంగా ఉంటాయి. కానీ మనం ఎంత శుభ్రంగా బ్రష్ చేసుకున్న మన నోటిలో ఉండే పళ్ళల్లో బ్యాక్టీరియా పూర్తిగా తొలగి పోకుండా కొంత శాతం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా పదార్థం తింటామో ఇప్పుడు మన నోట్లో ఉండే బ్యాక్టీరియా మనం తినే పదార్థంలో ఉండే ప్రోటీన్ ,గ్లూకోజ్ మరియు బయో ప్రొడక్ట్స్  తీసుకొని పళ్ళ సందుల్లో లేదా వాటి దగ్గర plaque ను తయారుచేస్తాయి.

ఈ ప్లేక్  తెల్లగా ఉండే పదార్థం ఇది మన పళ్లపై ఏర్పడుతుంది. దీనిని మనము అంత సులభంగా చూడలేము. కానీ ఇది ఎప్పుడైతే అధికంగా ఏర్పడుతుందో దాని పొర మందంగా మారుతుంది అప్పుడప్పుడు మన నాలుక దానిపై కదిలించడం ద్వారా దాని యొక్క అనుభూతిని పొందవచ్చు. పళ్ళ మధ్యలో టూత్ పిక్ వచ్చినప్పుడు తెల్లటి పదార్థం వస్తుంది దానిని ప్లేక్  అంటారు. దీనిని సులభంగా బ్రెష్ చేయడం ద్వారా తొలగించుకోవచ్చు. కానీ చాలామంది బయటకు కనిపించే పళ్లపై మాత్రమే బ్రష్ చేసుకోడానికి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. ఫాస్ట్ గా బ్రష్ చేసుకోవడం వల్ల వెనకాల ఉండే ఈ పదార్థం పూర్తిగా బయటికి తొలగిపోకుండా  అక్కడే కొద్దికొద్దిగా పేరుకుపోతుంది. దీనివల్ల కొద్ది కాలానికి అది మందంగా మారిపోయి పళ్ళ వెనుక గార  పట్టేస్తాయి. దీనినే ఇంగ్లీషులో tartar (టార్టార్)  అని అంటారు. దీనిని తొలగించుకోవడానికి చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి పళ్లను శుభ్రం చేయించుకుంటారు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

పళ్ళు తెల్లగా మారడానికి గార పోగొట్టడానికి కొన్ని చిట్కాలు

మొదటి చిట్కా : రెమిడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక టమోటా, కమలా కాయ తొక్కు మరియు ఉప్పు. కమలా కాయ తొక్కు టమాటాలు మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ టూత్ బ్రష్ మీద వేసి కొద్దిగా ఉప్పుని దాని మీద వేసి బ్రష్ చేసుకోవాలి. తర్వాత మీరు రోజు బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ తో మరొకసారి బ్రష్ చేసుకోండి.

రెండవ చిట్కా : ఈ రెమిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. కొబ్బరి నూనె, బేకింగ్ సోడా మరియు కొద్దిగా ఉప్పు. ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి అందులో అరస్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూడింటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మీ చేతి వేళ్ళతో కానీ టూత్ బ్రష్ తో కానీ మీ పళ్ళను బ్రష్ చేసుకోండి. బేకింగ్ సోడా మన పళ్లపై ఉండే పసుపు ధనాన్ని మరియు బాక్టీరియాని తొలగిస్తుంది.

మూడవ చిట్కా : ఈ రెమిడి  తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నల్ల నువ్వులు, లవంగ నూనె, దీనిని క్లోవ్ ఆయిల్ అని కూడా అంటారు. ముందుగా రెండు నుంచి మూడు చెంచాల నల్ల నువ్వులను మీ నోట్లో వేసుకొని ఒకసారి బాగా నమిలి మీ నోట్లోనే ఉంచుకోవాలి. తర్వాత మీ టూత్ బ్రష్ ఒకసారి నీళ్లలో కడిగి దానిపై నాలుగు నుంచి ఐదు చుక్కల లవంగం నూనె వేసి మీ పళ్ళను బాగా శుభ్రం చేసుకోండి.

మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత ఆహారంలో ఉండే కొన్ని పదార్థాలు మన నోట్లో ఉండే పళ్ళలో  ఉండిపోతాయి దీనివల్ల ప్లేక్ తయారవుతుంది. ఈ ప్లేక్  నుంచి మన కాపాడుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఒక చెంచా సోంపు తినండి. సోంపు తినటం వల్ల మన పళ్ళు శుభ్రంగా అవుతాయి మరియు భోజనం కూడా బాగా జీర్ణం అవుతుంది.

మీకు సిగరెట్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఎందుకంటే సిగరెట్ తాగడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అలాగే రోజు మొత్తంలో ఎక్కువ శాతం నీళ్లు తాగండి. నీళ్లు తాగడం వల్ల మన పళ్ళు నోరు శుభ్రం అవుతుంది. చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే పళ్ళ పై ఏర్పడే ఎలాంటి మొండి గరలైన  సులభంగా తగ్గిపోతాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా పేజీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మర్చిపోకండి.

1 thought on “మీ పంటి పై గార పోయి మీ పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి”

Leave a Comment

error: Content is protected !!