చంకలలో అవాంఛిత రోమాలు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. లేదంటే చంకలు నల్లగా మారిపోతాయి. మీ చంకలు క్లీన్ చేసుకునే టప్పుడు అలోవెరా జెల్ అప్లై చేసి చేసుకున్నట్లయితే స్మూత్ గా అవుతాయి. టైట్ గా ఉండే బట్టలు, సిల్క్, సింథటిక్ బట్టలు వేసుకోవడం వలన చమట పీల్చుకోవు. అవాంఛిత రోమాలు ఉన్నపుడు చమట పట్టడం వలన చంక భాగం మొత్తం నల్లగా నల్లగా మారిపోతుంది. కొంతమందికి ఆడవారైనా, మగవారైనా సరే స్లీవ్ లెస్ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు.
కానీ చంకలు నల్లగా ఉండడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. చంకలు నల్లగా అవకుండా ఉండాలంటే కాటన్ బట్టలు, లూజ్ గా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. ఇప్పుడు మనం నల్లగా అయిన చంకలు తెల్లగా ఎలా మార్చుకోవాలో దానికోసం చిట్కాలను తెలుసుకుందాం. ఎటువంటి మందులు క్రీములు అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఈ చిట్కాలను ట్రై చేసినట్లయితే చంకల్లో నలుపు మొత్తం పోయి తెల్లగా అవుతాయి.
Bమొదటి చిట్కా ఒక బౌల్లో ఒక చెంచా కొబ్బరి నూనె, కొంచెం సాల్ట్, వైట్ కోల్గేట్ పేస్ట్ వేసి బాగా కలిపి చంకల్లో అప్లై చేసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తర్వాత నిమ్మచెక్క తీసుకొని 5 నిమిషాల పాటు సర్కులర్ మోషన్ లో రబ్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు రోజులు చేయడం వలన మీ చంకలు తెల్లగా అవుతాయి. బియ్యప్పిండి, టమాట జ్యూస్, పెరుగు ఈ మూడు రోజులు సమానం మోతాదులో తీసుకుని బాగా కలిపి చంకలకు అప్లై చేస్తూ సర్కులర్ మోషన్లో రబ్ చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే నలుపు మొత్తం పోయి చంకలు చర్మం రంగు లోకి వచ్చేస్తాయి.
మూడవ చిట్కా ఒక చెంచా తేనె ఒక చెంచా పచ్చిపాలు అర చెంచా నూనె వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.కీరదోసకాయ పేస్ట్ చేసి ఒక చెంచా తీసుకోవాలి. ఒక చెంచా కొబ్బరి నూనె, అరచెంచా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చంకలకు అప్లై చేసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. నాల్గవది పంచదార తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి.
టమాటో కట్ చేసుకొని పంచదార పౌడర్ లో ముంచి రుద్దినట్లయితే చంకల నలుపు మొత్తం పోయి చర్మం రంగులోకి మారతాయి. ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసినట్లయితే నలుపు మొత్తం పోయి తెల్లగా అవుతాయి. మీకు ఈ ఆరు చిట్కాలలో ఏదైతే బాగా పని చేస్తుందో ఆ చిట్కా ను ఉపయోగించండి.