How To Whiten Yellow Teeth Naturally

తెల్లని పలువరస కావాలా?? అద్భుతమైన చిట్కాలు మీకోసమే మరి.

మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేది నవ్వు. టీవీ లో హాల్ చల్ చేసే యాడ్స్ ఇవే. మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ పేస్ట్ లో వేప ఉందా??  మా పేస్ట్ లో వేప, లవంగం, తులసి వంటి మూలికలు ఉన్నాయ్.  ఇలాంటి యాడ్స్ బోలెడు రోజు చూస్తూనే ఉన్నాం. మనం నలుగురిలో ఎలాంటి సంశయం లేకుండా మాట్లాడాలన్నా, నవ్వాలన్నా అందమైన తెల్లని పలువరుస ముఖ్యం. అలాంటి పలువరుస లేకపోతే తొందరగా పెదవి విప్పలేం, నవ్వు వచ్చినా పెదవి సాగదీసి మన నవ్వును నోట్లోనే నొక్కేసుకుంటాం. అసలు పళ్ళు తెల్లగా లేకుండా వుండటానికి కారణాలు ఏమిటి చూస్తే…..

◆ ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు

◆ అతి చల్లని, మరియు అతి వేడి ఉన్న పదార్థాలను తినడం లేదా తాగడం.

◆అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు. దీర్ఘకాలికంగా మందులు వాడటం

◆ నీటిలో ఫ్లోరైడ్ సమస్య

◆ ఆహార, మరియు నిద్ర వేళలు తారుమారు అవడం

◆ చిగుళ్ల బలహీనత తద్వారా దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం. 

పైవన్నీ దంతాలు తెల్లగా లేకపోవడానికి కారణం అయితే తిరిగి సంతలు తెల్లగా మెరిసేలా చేసుకోవడానికి అద్భుతమైన రెండు చిట్కాలు మీకోసం.

మెంతులు

మెంతులు వంటింట్లో లభించే గొప్ప ఔషధాలు నిండి ఉన్నవి. మెంతులు దంత సంరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తాయి.  

మెంతులను దంచి జల్లించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక టైట్ కంటైనర్ లో నిల్వచేసుకోవాలి. 

ప్రతిరోజు రెండు పూటలా కొద్దిగా మెంతి పొడితో పళ్ళను సున్నితంగా రుద్దుతూ తోమాలి. పళ్ళు, చిగుళ్లు, దవడ దంతాలు మొదలైన అన్నిటికి మెంతి పొడిలోని సారం తగిలేలా మెల్లిగా తోమాలి. తరువాత సాధారణ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

మెంతి పొడి చేదు మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినట్టు ఉండచ్చు కానీ తరువాత అలవాటైపోతుంది. ముఖ్యంగా కొద్దీ రోజుల్లోనే పళ్ళు తెల్లగా అవడం మీరే గమనిస్తారు. 

అయితే పళ్ళ గూర్చి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అతి చల్లని, అతి వేడి, తీపి పదార్థాలు తినడం అవి తిన్నాక నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే వదిలెయ్యడం, ఆహార వేళలు, నిద్రవేళలు మాటికి మారుస్తూ ఉండటం లాంటివి చేయకుండా  సమయ వేళలు పాటించాలి.

కొబ్బరి నూనె, ఉప్పు

ఉప్పు పళ్లకు మంచి ప్రభావాన్ని చూపిస్తుందని అందరికి తెలిసినదే.  అయితే తెల్లని పలువరుస కోసం మూడు, నాలుగు చుక్కల కొబ్బరి నూనె, అందిలోకి చిటికెడంత ఉప్పు వేసి వేలితో మర్ధించి దాన్ని పళ్ళ మీద, చిగుర్లకు బీజ్ పట్టేలా వేలితో రుద్దుతూ మెల్లిగా మసాజ్ కూడా చేసుకోవాలి. 

ఇలా రోజు చేయడం వల్ల పళ్లలో ఉన్న బాక్టీరియా, పీక్ళ్ల మీద పసుపురంగు గార, పాచి వంటివి సులువుగా తొలగించబడతాయి. కేవలం వారం నుండి పది రోజుల లో ఫలితాన్ని ఇస్తుంది ఈ చిట్కా. పైన చెప్పుకున్నట్టు రోజువారీ సమయ వేళలు పాటించడం ఉత్తమం.

చివరగా….

మన అలవాట్లే మన దంతాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి మంచి అలవాట్లను భాగం చేసుకుంటే తెల్లా తెల్లని పళ్ళు మీ సొంతం.

Leave a Comment

error: Content is protected !!