How ToMake oil for White hair to black InTelugu

తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే ఆయుర్వేదిక్ ఆయిల్..

తెల్లజుట్టు చిన్నపిల్లల నుండి టీనేజ్ పిల్లలు, ముప్ఫైలలో ఉండే వారుకూడా వీటితో బాధపడుతున్నారు. వీటికి మార్కెట్లో దొరికే రకరకాల డైలు, నూనెలువాడి విసిగిపోయారా. అయితే ఒక్కసారి ఈ చిట్కా పాటించండి.  దానికోసం సహజంగా దొరికే పదార్థాలు వాడాలి. అవీ మన పూర్వీకుల నుండి మన ఆరోగ్యం అందం రక్షణ కోసం వాడే పదార్థాలు. అవేంటో ఆ నూనె తయారీ ఇప్పుడు తెలుసుకుందాం.

దానికోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు. 

ఉసిరి పొడి ఒక స్పూన్, బృంగరాజ్ పౌడర్ అంటే గుంటగలగరాకు పొడి ఒక స్పూన్, కరివేపాకు పొడి ఒక స్పూన్, ఇండికా పౌడర్ రెండు స్పూన్లు, మెంతి పొడి ఒక స్పూన్,  కలోంజి పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి. వీటిని ఎయిర్ టైట్ బాటిల్లో వేసి వీటిని బాగా షేక్  చెయ్యాలి. ఇందులో ఒక స్పూన్ రోజ్మేరీ ఎసెన్సియల్ వెయ్యాలి. తర్వాత కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనె మరియు ఆముదం నూనె తీసుకోవాలి. ఆముదం తయారుచేసుకున్న పౌడర్కి సమానంగా తీసుకోవాలి. దానికి రెండు రెట్లు కొబ్బరినూనె తీసుకోవాలి. 

ఈ మిశ్రమం బాగా కలిసేలా కలిపి బాటిల్ మూత పెట్టుకోవాలి. ఈ నూనెను ఏడురోజుల పాటు ఎండలో పెట్టాలి. ఇందులో వాడే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లోని పోషకాలు జుట్టుకు అందుతాయి. నూనె వేడెక్కక పోవడం వలన హానికారక మినరల్స్ కూడా ఏర్పడవు. అలాగే ఈ నూనెను జుట్టు కుదుళ్ళకు మాత్రమే అప్లై చెయ్యాలి. మళ్ళీ చెప్తున్న జుట్టంతా కాదు కేవలం తలలోని చర్మానికి పట్టేలా మర్దనా చెయ్యాలి. ఇలా చేయడం వలన ఇందులోని పోషకాలు తలకు అందడంతో పాటు నలభైకి ముందు వచ్చే తెల్లజుట్టును నిరోధిస్తుంది. 

అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది. ఈ నూనెను తలస్నానానికి ముందు రోజు అప్లై చేసుకుని మరుసటిరోజు సహజ కుంకుడు,సీకాయలతో లేదా హెర్బల్, మైల్డ్ షాంపూతో తలస్నానం  చేయాలి. మన బుషులు మునులు అందించిన ఆయుర్వేదం మనకు అందించిన మూలికలు ఎంతో విలువైనవి. వాటిని ఉపయోగించి అద్బుతమైన ఫలితాలు పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!