ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన పనిలా మారిపోయింది. మనకు తెలియకుండానే అధిక బరువు పెరిగిన తరువాత అనారోగ్య సమస్యల వలన బరువు తగ్గాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే టిప్ పాటించడం వలన ఈజీగా బరువు తగ్గవచ్చు. గుండెపోటు, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలకు అధిక బరువు కారణం అవుతున్న కారణంగా అనేక మంది బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉండే ఆహారాలు తగ్గించుకొని శరీరానికి కావలసిన పోషక ఆహారాన్ని అందిస్తూ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ తాగడం వలన ఈజీ గా బరువు తగ్గవచ్చు. దీని కోసం మనం కేవలం వంట ఇంట్లో ఉండే 2 పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం.
ముఖ్యంగా ఈ చిట్కా కోసం ఒక గ్లాస్ నీటిని స్టవ్పై పెట్టుకోవాలి. దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు నీటిని బాగా మరిగించి నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి దీనిలో పావు చెంచా జీలకర్ర పొడి కలుపుకోవాలి. జీలకర్ర బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇలా ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు తాగడం వలన శరీరంలో కొవ్వు కరిగి పోతుంది. కరివేపాకు మీ జీర్ణవ్యవస్థకు అద్భుతమైనది. అవి అజీర్ణం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి మరియు సులభంగా ప్రేగు కదలికలో సహాయపడతాయి. అవి మీ గట్ మరియు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
అలాగే జీలకర్ర మీ జీవక్రియను పెంచుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు మీ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే కొంతమందికి గ్రౌండ్ జీలకర్ర తీసుకోవడం సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. ఇలా కనీసం రెండు నెలల పాటు తీసుకోవడం వల్ల బరువులో తేడా మీరే గమనిస్తారు. మరియు మనం తీసుకునే పదార్థాలు ఎటువంటి దుష్ప్రభావాలను లేకుండా ఆరోగ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది.