ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు వలన మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్ ట్రబుల్ అజీర్తి మలబద్ధకం ఎసిడిటీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు తప్పించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తెచ్చుకునే ఇంగ్లీష్ మందులు ఉపయోగించడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అన్ని సమస్యలకు ఇంగ్లీష్ మందులు మీద ఆధారపడకుండా నాచురల్ పద్ధతిలో కూడా కొన్నింటిని తగ్గించుకోవచ్చు.
వాటిలో ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు. అజీర్తి సమస్య ఉండడం వల్ల కడుపు బరువుగా ఉండటం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటిని తగ్గించుకొని ఆకలి బాగా వేయాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. దీని కోసం ఒక చెంచా మిరియాల పొడి తీసుకొని చిన్న రోలులో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మార్కెట్లో దొరికే మిరియాల పొడి ఉపయోగించకూడదు. వాటిలో ఏం కలుపుతారో ఏమి ఉంటాయో మనకు తెలియదు. అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల సమస్య తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి.
మెత్తగా దంచిన మిరియాల పొడిని ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా తేనె వేసుకోవాలి. దీనికోసం పట్టు తేనె మాత్రమే ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే తేనె ఉపయోగించకూడదు. ఎందుకంటే వాటిలో షుగర్ సిరప్, కార్న్ సిరప్ వంటివి కలుపుతారు. వీటివల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. మిరియాల పొడిని తేనెను బాగా కలుపుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవడం వలన కడుపు తేలికపడుతుంది.
జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఆకలి బాగా వేస్తుంది. అస్సలు ఆకలి వేయట్లేదు, కడుపు బరువుగా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి ఈ చిట్కాను ఉపయోగించినట్లయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది నేచురల్ చిట్కా కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లీష్ మందులు వాడి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కంటే ఇలాంటి నాచురల్ చిట్కాలను ఉపయోగించి సమస్యలను తగ్గించుకోవడం మంచిది. ఎన్నో రోజుల నుంచి బాధిస్తున్న సమస్య ఈ చిట్కాను ట్రై చేసిన వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు.