కరోనా విలయతాండవం చేస్తుంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్న ఈ తరుణంలో ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష. మనం తీసుకునే ఆహారం, శారీరక, మానసిక పరిస్థితులు ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. అందుకే వీలయినంత వరకూ జనాలతో కలవడం మానేయాలి. దానికి తోడు మాస్క్, శానిటైజర్ వాడడం తప్పనిసరి అయిన సందర్బాల్లో మరిన్ని సొంత దిద్దుబాటు చర్యలు మనల్ని రక్షిస్తాయి.అవేంటో చూద్దాం రండి.
తగినంత నిద్ర పొందండి. నిద్ర మరియు రోగనిరోధక శక్తి దగ్గరగా ముడిపడి ఉన్నాయి. …
మొత్తం మొక్కల నుండి వచ్చే ఆహారాన్ని ఎక్కువగా తినండి. అంటే ఆకుకూరలు, కూరగాయలను ఆహారంతో ఎక్కువగా భాగం చేసుకోండి. అనేక విటమిన్ లోపాలు కూడా కరోనా వలన మరణ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే కూరల్లో మాత్రమే దొరికే విటమిన్స్ కోసం కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తినండి.
మరింత ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి. దీనికోసం తక్కువ మొత్తంలో నెయ్యి,బలవర్థక ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఇంటిఆహారాన్ని తీసుకోండి.
పులియబెట్టిన ఆహారాన్ని తినండిఅంటే పెరుగు సంబంధ పదార్థాలు లేదా ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ని తీసుకోండి. పెరుగులో సహజంగా దొరికే ప్రొబయోటిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పెరుగు ఎక్కువగా తీసుకోండి. ఎండాకాలం కూడా కావడంతో మజ్జిగ రూపంలోనైనా పెరుగు, లస్సీ లాంటి పదార్థాలు బాగా తినండి.
జోడించిన చక్కెరలను పరిమితం చేయండి. చక్కెరతో చేసిన పదార్థాలు తినకండి. వీలైనంత సహజ తీపిని అందించే పదార్థాలు తీసుకోవడం మొదలుపెట్టండి. వీటివలన ఆరోగ్యంతో పాటు తీపి తినాలనే ఆశ కూడా తీరుతుంది. ఖర్జూరంపొడి, బెల్లం, తేనె చక్కెర కు ప్రత్యామ్నాయాలు.
మితమైన వ్యాయామంలో పాల్గొనండి. రోజూ కనీసం ముప్ఫై నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోండి. నడక, ఈత, యోగా ఏదైనా శారీరక శ్రమ శరీరాన్ని ఆరోగ్యం గా చేస్తుంది
హైడ్రేటెడ్ గా ఉండండి. రోజులో ఎక్కువ శాతం నీరుతాగండి. మూడున్నర లీటర్ల నీళ్ళు తప్పనిసరి. గోరువెచ్చని నీటిని తీసుకోవడం మరింత మంచిది.
మీ ఒత్తిడి స్థాయిలను నిర్వహించండి.ఒత్తిడి తగ్గించుకోవడానికి హాబీలను అలవాటు చేసుకోండి. దానితో గొంతులో నొప్పి లాంటివి ఉంటే ఉప్పునీళ్ళ పుక్కిలించడం, పసుపుపాలు తీసుకోవడం,తేలికపాటి కషాయాలు మీ ఆరోగ్య రక్షణలో సహాయపడతాయి. ఏవైనా లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ముందు జాగ్రత్త లతో కరోనాని జయిద్దాం