Immunity-Booster-Drink-For-virus

క*రోనా వచ్చిన చావకుండా 100 ఏళ్ళు బ్రతకాలంటే వారానికి 2 సార్లు 1గ్లాస్ ఇది తాగితే చాలు|immunity drink

క*రోనా రెండవ దశలో మరింత భయానికి గురిచేస్తోంది. ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. అవి మందులను ఎక్కువగా వాడడంవలన దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంట్లో ఉండే పదార్థాలతో చేసే చిన్న చిట్కాలతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో చూసేద్దాం.

జీలకర్ర రెండు స్పూన్లు, ధనియాలు ఒకస్పూన్, సోంపు ఒక స్పూన్, దాల్చిన చెక్క పెద్దది ఒకటి, ఇలాచి ఐదు లేదా ఆరు, లవంగాలు నాలుగు, తులసి ఆకులు పది శుభ్రంగా కడిగి ఆరబెట్టినవి.మిరియాలు పది తీసుకోవాలి. 

వీటిని బాండలిలో ఒకదాని తర్వాత ఒకటి  వేసి సిమ్లో వేయించాలి. అన్ని మాడిపోకుండా చూసుకోవాలి. తులసి ఆకులు రంగుమారిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లార్చాలి. తర్వాత వీటిలో స్పూన్ పసుపు, ఒక స్పూన్ శొంఠిపొడిని వేసి మొత్తం మెత్తటి పొడిలా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వచేసుకుని వాడుకోవచ్చు. 

ఈ పొడిని ఎలా వాడాలంటే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టీ  మరిగేంతవరకూ ఉంచాలి. తర్వాత ఇద్దరికి అయితే అరస్పూన్, ఒకరికి అయితే పావుస్పూన్ పొడి వేయాలి.

నీటిని మూడునిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి , ఒక స్పూన్ తేనె కలపాలి. తర్వాత గోరువెచ్చగా ఈ నీటిని తాగాలి. ఇలా తాగడంవలన రోగనిరోధక శక్తి బలపడుతుంది. 

డయాబెటిస్ ఉన్నవారు, తేనె అందుబాటులో లేనివారు నల్ల ఉప్పు కలుపుకోవచ్చు. వంట ఉప్పు మంచిది కాదు. ఇంతే కాకుండా ఈ పొడిని పాలల్లో కూడా వేసి మరిగించి తాగొచ్చు. రాత్రి పడుకునేటప్పుడు తాగితే గొంతునొప్పి , గురగుర తగ్గిస్తుంది. లేదా కూరల్లో మసాలాలాగ వాడుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకు చిటికెడు పొడి వేసి అందులో తేనె వేసి పిల్లలకు నాలుకకు రాయడంవలన దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. 

ఇందులో వాడినవన్నీ సహజపదార్థాలు కనుక ఎటువంటి దుష్ప్రభవాలు ఉండవు. జలుబు, దగ్గు తగ్గిస్తాయి. గుండెల్లో చేరిన కఫాన్ని కరిగించి ఇతర పిత్త సమస్యలు తగ్గిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్లూ లక్షణాలు తగ్గిస్తుంది. క*రోనా లక్షణాలు అయిన జ్వరం, దగ్గుతో పోరాడి క*రోనా రాకుండా లేదా వచ్చిన తర్వాత ప్రాణాంతకం కాకుండా ఆపుతుంది. 

Leave a Comment

error: Content is protected !!