కరోనా మహమ్మారి బారినపడిన తర్వాత చాలామంది నీరసం తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. నీరసం,అలసట వలన ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం అనేది ఈ మధ్య ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యలు తగ్గడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం. ఈ చిట్కాలు పాటించడం వల్ల శరీరంలో ఇమ్యునిటీ పెరగడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ చిట్కాలు ఇంట్లో ఉండే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు.
మీరు కరోనా మహమ్మారి బారిన పడినట్లయితేనీరసం తగ్గడానికే కాకుండా శరీరంలో ఇమ్యునిటీ పెరగడానికి కూడా ఈ చిట్కా సహాయపడుతుంది. ఈ చిట్కా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ వాడవచ్చు. దీనికోసం మనకు కావలసింది పూల్ మఖని. అంటే తామర గింజలు ఈ ఫూల్మఖని కిడ్నీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్తో బాధపడేవారు కూడా తినవచ్చు. ఇది మీ రక్తంలో ఇన్సులిన్ ని అదుపు చేస్తుంది.
శరీరంలో నీరసం, నిస్సత్తువ, అలసటను తగ్గిస్తుంది. వీటిలో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, కీళ్లనొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. వీటి వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వీటితోపాటు కావలసిన పదార్థం బాదం. బాదంలో కూడా కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్ పుష్కలంగా దొరుకుతాయి. రోగాలను నివారించే శక్తి బాదంలో పుష్కలంగా దొరుకుతుంది. ఎవరైతే రోజంతా నీరసం, నిస్సత్తువతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు కూడా తప్పకుండా తీసుకోవాలి.
నీరసంతో బాధపడే వారు, శక్తి లోపం వల్ల ఇబ్బంది పడేవారు తీసుకుంటూ ఉంటే ఇమ్యునిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ నొప్పులుకి సంబంధించి ఎటువంటి సమస్యలు అన్ని దూరం చేసి మార్చడానికి పనిచేస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన మూడవ పదార్థం నువ్వులు. ఇవి ఖచ్చితంగా చెప్పవచ్చు ఇమ్యునిటీ పెంచడానికి మాత్రమే కాదు వీటిలో ఉండే క్యాల్షియం అనేది ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఇవి మన శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ అందించడంలో చాలా బాగా సహాయపడుతాయి.
నాలుగో పదార్థం కర్బూజా విత్తనాలు. వీటిలో కూడా విటమిన్ ఏ, ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. తర్వాత పదార్థం సోంపు గింజలు. దీనిలో కూడా కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తర్వాత పదార్థం దాల్చినచెక్క వీటన్నింటిని తీసుకొని పొడి చేసుకోవాలి. దాని కోసం ఒక కప్పు పూల్ మఖని, ఆరేడు బాదంపప్పులు, ఒక స్పూన్ కర్బూజా గింజలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక అర స్పూన్ సోంపు గింజలు, ఒకటి లేదా రెండు దాల్చినచెక్క ముక్కలు లేదా పావుస్పూన్ పొడి తీసుకోవాలి.
వీటిన్నింటిని మిక్సీలో మెత్తని పొడిగా చేసుకోవాలి. దీనిని ఆవు పాలతో మాత్రమే తీసుకోవాలి. ఆవు పాలు దొరకని పక్షంలో గేదె పాలు తీసుకోవచ్చు. పాలను బాగా మరిగించి ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత తీసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లలకి అర స్పూన్ పొడి కలిపి ఇవ్వచ్చు. ఈ పాలను భోజనం చేసిన అరగంట తర్వాత తేనె లేదా పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. పంచదార ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. ఈ పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఎటువంటి వైరస్ ల బారిన పడకుండా కాపాడుతాయి.
Very useful Information. Kalpana Naturals Provides one of the best product to increase our Immunity.
Buy our Best product
Best Immunity Booster Ayurvedic Medicine by Kalpana Naturals.