పోలీక్ యాసిడ్ అనేది బి కాంప్లెక్స్ విటమిన్స్ లో ఒకటి. ఇది కూడా వాటర్ సాలబుల్ విటమిన్. మన శరీరంలో ఆస్థీ మధ్యలో రక్త కణాలు ఉత్పత్తికి పోలిక్ యాసిడ్ అతి ముఖ్యం. పోలిక్ యాసిడ్ లోపం ఉంటే రక్తం శరీరంలో ఎక్కువగా ఉండదని అందరికీ తెలుసు. కానీ పోలిక్ ఆసిడ్ వలన అనేక లాభాలు ఉంటాయి. అందువలన ప్రతినిత్యం మన శరీరానికి పోలిక్ యాసిడ్ అందించాలి. పోలిక్ యాసిడ్ వలన మన శరీరానికి పది ముఖ్యమైన లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి 400 మైక్రోగ్రామ్స్ ప్రతిరోజు కావాలి.
మొదటిగా మన శరీరంలో కణ విభజన జరిగేటప్పుడు కణవిభజనకు, డీఎన్ఏ ఉత్పత్తికి పోలిక్ యాసిడ్ అవసరం. రెండవదిగా తల్లి గర్భంలో బిడ్డ యొక్క ఎదుగుదలకు అవయవాల ఎదుగుదలకు పోలిక్ యాసిడ్ అతి ముఖ్యం. ఇది లేకపోతే బిడ్డ ఏదో ఒక లోపంతో పుడుతుంది. మూడోవదిగా రక్తంలో షుగర్ కంట్రోల్ చేయడానికి పోలీక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. నాలుగోదిగా మన శరీరంలో లివర్ అన్నిటిని డిటాక్సీఫికేషన్ చేస్తుంది. కానీ లివర్ను డీటాక్సిఫికేషన్ చేయడానికి కొన్ని పోషకాలు అవసరం. ఆ పోషకల్లో ముఖ్యంగా పోలిక్ యాసిడ్ అవసరం.
ఐదవదిగా మన శరీరంలో హోమో సిస్టీన్ అనే ఒక అమైనో యాసిడ్ తయారవుతుంది. ఇది ఎక్కువ అవ్వడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. దీని ప్రొడక్షన్ తగ్గించడానికి పోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఆరవధిగా మజీల్ యాక్టివిటీని హెల్తీగా ఉంచడానికి పోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఏడవదిగా కంటి చూపుని కాపాడడానికి పోలిక్ యాసిడ్ కావాలి. ఎనిమిదవదిగా ముసలి వయసులో కూడా మన శరీరం యాక్టివ్ గా పని చేయడానికి పోలిక్ యాసిడ్ పని చేస్తుంది.
తొమ్మిదవదిగా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా రక్షిస్తుంది. పదవదిగా డిప్రెషన్స్ రాకుండా మూడ్ స్వింగ్స్ స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇటువంటి పోలిక్ యాసిడ్ మనకు ఎక్కువగా పాలిష్ పట్టని విత్తనాలలో ధాన్యాలలో లభిస్తుంది. అంటే తౌడు తీసుకోవడం ద్వారా పోలిక్ యాసిడ్ బాగా లభిస్తుంది. పోలీక్ యాసిడ్ ఎక్కువగా లభించే విత్తనాలు పెసలు, అలసందలు, శనగలు. వీటిని రోజు ఆహారంలో ఉపయోగించగలిగితే పుష్కలంగా లభిస్తుంది. ఆకుకూరల్లో పుదీనా, ఫ్రూట్స్ అన్నిటిలోనూ, వెజిటేబుల్స్ బెండకాయ వంటి వాటిల్లో పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది