importance of kidneys in human body

వీటి పనితీరు సరిగా లేకుంటే జీవితం కండకండాలుగా మారిపోతుంది.

మనం తీసుకునే ఆహారం, నీరు నుండి కావలసిన పోషకాలు, విటమిన్లు మొదలైనవి మన శరీర భాగాలకు సరఫరా అయిన తరువాత మిగిలిపోయిన వ్యర్థాలు మూత్రం మరియు మలం అనే రూపం లో విసర్జించబడతాయి.

మన శరీరంలో వెన్నుభాగం కిందుగా చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న నిర్మాణాలనే కిడ్నీలు లేదా మూత్రపిండాలు అని అంటాము. మన శరీరంలోని యూరియా, క్రియాటిన్ లాంటి వ్యర్థపదార్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని తయారు చేస్తాయి. తయారైన మూత్రం మూత్రనాళం, మూత్రాశయం గుండా ప్రయాణించి మూత్రద్వారం ద్వారా  బయటకు విసర్జించబడతాయి.

  వెన్నుపూస కిందుగా ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఒకొక్క మూత్రపిండం పది సెంటీమీటర్ల పొడవు, అయిదు సెంటీమీటర్ల వెడల్పు, నాలుగు సెంటీమీటర్ల మందం తో ఉంటుంది. మూత్రపిండం బరువు సరాసరి 150 గ్రాముల నుండి 170 గ్రాముల వరకు ఉంటుంది. శరీరంలో మూత్రనాళం 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 

కిడ్నీ పని

రెండు కిడ్నీలు నిమిషానికి దాదాపు 1200 మిల్లి లీటర్ల రక్తాన్ని శుభ్రంచేస్తాయి. మన శరీరంలో ప్రవహించే మొత్తం రక్తంలో ఇది 20% గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా  ఒక్కరోజులో మొత్తం 1700 లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు వడపోస్తాయి.

రక్తాన్ని శుభ్రం చేసి మూత్రాన్ని తయారు చేసే నెఫ్రాన్లు మూత్రపిండాల్లో ఉంటాయి. ఇవి దాదాపు ఒకో మూత్రపిండంలో పది లేక పదమూడు లక్షలు ఉంటాయి.

రక్తంలో ఆమ్లాలు, లవణాలు, సమానంగా ఉండేలా మూత్రపిండాలు చేస్తాయి.

సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్పరస్, బైకార్బోనేట్ లను సమానంగా ఉండేలా చేస్తాయి.

సోడియం ఎక్కువ తక్కువల అవడం వలన   మెదడు పై పడే ఎముకల ప్రభావం మరియు పొటాషియం హెచ్చుతగ్గుల వల్ల గుండె పైన పడే ఎముకల ప్రభావాన్ని మూత్రపిండాలు అదుపులో ఉంచుతాయి.

శరీరంలో రక్తకణాల ఉత్పత్తికి సాయపడే ఏరిత్రోపాయిటివ్ కిడ్నీలలోనే ఉత్పతి అవుతుంది. అంటే కిడ్నీల ద్వారా నే  మన శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది. 

కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి లను సక్రమంగా ఉంచి కండరాలు మరియు ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది.

కిడ్నీల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు.

నీరు

ముఖ్యంగా కిడ్నీలకు, నీటికి ఉన్న అవినాభావసంబందం గొప్పది. అందుకే రోజుకు మూడు నుండి అయిదు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి.  నీరు ఎక్కువ తాగడం కేవలం శరీరానికి కాదు ముఖ్యంగా మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

ఎరుపురంగు సిమ్లా మిర్చి

దీన్ని అందరూ రెడ్ క్యాప్సికం అంటారు. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి, ఆక్సిడెంట్లు  ఉంటాయి. అలాగే పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఇది మూత్రపిండాలు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

వెల్లుల్లి

తెల్లగడ్డ, వెల్లుల్లి గా పిలుచుకునే దీంట్లో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఎక్కువ. రక్తం శుభ్రమై అనవసర వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. 

యాపిల్

బీపీని నియంత్రణలో ఉంచడానికి యాపిల్ చాలా బాగా తోడ్పడుతుంది.  మనసారీరం రక్తపోటు సక్రమంగా ఉండటం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది.

పుట్టగొడుగులు

వీటిలో విటమిన్-డి, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

స్ట్రాబెర్రీ

అందరికి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీని తినడం వల్ల ఫైబర్, విటమిన్లు శరీరానికి అందుతాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

ఓట్స్

ఓట్స్ లో నీటిలో కరిగే ఫైబర్ అయినా బీటా గ్లూకోన్ ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండ కాపాడుతుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ బీపీని నియంత్రించడంలో చక్కగా పని చేస్తుంది. ఇందులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల బిపి ని హద్దులో ఉంచి మూత్రపిండాల వ్యవస్థను సంరక్షిస్తుంది.

క్యాలీఫ్లవర్

గోబీ పువ్వు గా పిలుచుకునే క్యాలీఫ్లవర్ లో విటమిన్-కె, విటమిన్-సి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. సల్ఫర్ మరియు పొటాషియం లు  శరీరంలో టాక్సిన్లను బయటకు పంపుతాయి.

చివరగా….

మూత్రపిండాల ఆరోగ్యం కేవలం ఆహారంతోనే కాదు, ప్రతీరోజు వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యంగా మాంసం, ప్రోటీన్లు మూత్రపిండాల మీద ప్రభావం.చూపిస్తాయి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటూ చక్కని ఆహార అలవాట్లు మరియు పరిశుభ్రత తో కిడ్నీ సమస్య కు దూరంగా ఉండచ్చు.

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!