importance of sindoor for indian women

ఇల్లాలు ఇలా బొట్టు పెట్టుకుంటే భర్త కోట్లు గడిస్తాడు

స్త్రీలు నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకుంటే దీర్ఘ సుమంగళిగా వుంటారని మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే కుంకుమ పెట్టుకోవడం వలన వారి భర్తలకు ఆర్ధిక వృద్ధి ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటున్నారు. వీటిని మొహం కడుక్కునేటప్పుడో లేదా స్నానం చేసేటప్పుడో అద్దానికి పెట్టి తిరిగి పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒకసారి ఉపయోగించిన బొట్టు మళ్లీ ఉపయోగించకూడదు. శరీరంలో  ఏడు చక్రాలు ఉంటాయి. అవి మనిషి వెన్నుపాము నుండి తల వరకు ఉంటాయి. 

అందులో ఒక చక్రం రెండు కనుబొమలకు మధ్య కొంచెం పైన ఉంటుంది. దీనిని త్రినేత్రం అని కూడా అంటారు. దీని వలనే మనిషి దేవుని చూడగలరు అని నమ్ముతారు. ఈ చక్రాన్ని ఉత్తేజితంగా ఉంచడానికి ఆ ప్రాంతంలో కుంకుమ పెట్టడం వలన లక్ష్మీదేవిని గౌరవించినట్లుగా భావిస్తారు. లక్ష్మీదేవి ఈ 5 స్థానాలలో ఉంటుంది. మొదటి స్థానం ఆవు యొక్క వెనుక వైపు ఉంటుంది. రెండవ స్థానం స్త్రీ యొక్క నుదుట కుంకుమ పెట్టుకునే స్థానంలో ఉంటుంది. మూడవ స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం, నాలుగవ స్థానం మారేడు దళం, ఐదవ స్థానం తామరపువ్వులో ఉంటుంది. కనుక నుదుటిన కుంకుమ పెట్టుకుని ఉన్న స్త్రీ లక్ష్మీదేవితో సమానం. స్త్రీలను గౌరవించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది.

అంపశయ్యపై ఉన్న భీష్ముని ధర్మరాజు అనేక సందేహాలు అడిగి నివృత్తి చేసుకుంటున్నాడు. అలాగే ఒక మనిషి ఉండవలసిన గుణాలు ఏమిటి? ఏమి చేస్తే మనుషులు నశించి పోతారు అని అడిగారు. దానికి భీష్ముడు ఒకసారి నారదుడు  నదీ స్నానానికి  వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రుడు నదీ స్నానం ముగించుకొని అనుష్టానం తీర్చుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె నమస్కారం చేసింది. ఇంద్రుడు ఆమెని నీవెవరు అని అడిగారు. దానికి ఆమె తామర పువ్వు నుండి పుట్టిన లక్ష్మీదేవిని నేను. ఇప్పటివరకు రాక్షసుల దగ్గర ఉన్నాను.  ఇప్పుడు వారి ప్రవర్తన నచ్చక మీ దగ్గరకు వచ్చాను అంది. రాక్షసుల ప్రవర్తనలో మీకు నచ్చనిది ఏమిటి అని అడిగాడు ఇంద్రుడు. దానికి ఆమె రాక్షసులు ఒకప్పుడు వేదాలు చదువుతూ అతిధి సత్కారాలు చేస్తూ దేవుని పూజించేవారు. 

కానీ ఇప్పుడు అహంకారంపెరిగిపోయి అందరినీ హింసిస్తున్నారు. అందుకే నేను పెద్దల పట్ల గౌరవం దేవుని పట్ల భయం, భక్తి, కరుణ ఎల్లవేళలా శుచి శుభ్రత ఉండే చోట్ల నేను ఉంటాను. అందుకే మీ దగ్గరకు వచ్చాను అంది. అప్పుడు ఇంద్రుడు సంతోషంతో లక్ష్మీదేవిని తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ విన్న వారు కూడా లక్ష్మీదేవి దయకు పాత్రులు అవుతారు. ఈ లక్షణాలు కలిగి ఉండడం వలన ఆమె దయ కలిగి ఐశ్వర్య వంతులు అవుతారు అని భీష్ముడు చెప్పాడు.

Leave a Comment

error: Content is protected !!