importance of sleep in life

దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

మనిషి రోజును  ప్రభావితం చేసేది అతని మానసిక స్థితి. మానసికంగా దృఢంగా ఉంటే ఏ పనిని అయినా హుషారుగా మొదలుపెట్టి ఎంత కష్టమైనా సాధించుకోగలుగుతారు. అలాంటి మానసిక స్థితిని 90% మనకు అందించేది చక్కని నిద్ర. మరి ఈ కాలంలో అటువంటి నిద్ర అందరూ పాటిస్తున్నారా అని చూసుకుంటే ఎన్నో ప్రశ్నార్థకాలు. కారణం ఏమిటని విశ్లేషించుకుంటే నేటి వేగవంతమైన జీవితం దోషిలా నిలబడుతుంది. 

అసలు  జీవితంలో నిద్రకున్న ప్రాముఖ్యం ఏంటని పరిశీలిస్తే.  రోజు రాత్రి పగలుగా విభజించబడ్డది కానీ ప్రస్తుతం అందరూ రాత్రి పగలు అనే తేడాల్లేకుండా జీవనవిధానం అలవాటు చేసుకున్నారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేవడం అనేది ఇప్పట్లో చాలా అరుదుగా కనబడుతుంది. నిద్రించడం మేల్కొవడం అనేవి అస్తవ్యస్తమయ్యాయి. టీవీ లు ఒకప్పుడు ప్రభావితం చేసిన అందరికి అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ కాలంలో అర్థరాత్రుల వరకు చాటింగులు, సినిమాలు, ప్రోగ్రాములు, యూట్యూబ్ వంటివి చూసుకుంటూ ఉదయం ఎనిమిది లేక తొమ్మిది గంటలకు నిద్రలేస్తూ ప్రకృతిలో శక్తిని అందుకోకుండ మనిషి రోగనిరోధక సామర్త్యాన్ని తగ్గించుకుంటున్నాడు.

ఉదయాన్నే  సూర్యకిరణాలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల విటమిన్ డి ని గ్రహించి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. కానీ నిద్ర తారుమారు అవ్వడం వల్ల మనం మేల్కొవడం ఆలస్యం అవుతుంది అందుకే మనకు ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ డి ను మనం కోల్పోతున్నాం.  ఇంకా నిద్రలేమి వల్ల చిరాకు, అసహనం, దేన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం వీటివల్ల కోపం మానసిక ఒత్తిడి ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూ మనవైపు వచ్చేస్తాయి.

అయితే చక్కని నిద్రకు కొన్ని చిట్కాలు చెప్పుకుని వీటిని అనుసరించడం వల్ల మన చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు ఒక్కసారి అవేంటో చూద్దామా…..

◆సమయం

రోజులో కచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలనేది నిపుణుల సలహా కానీ రాత్రి ఏ రెండు గంటలకు నిద్రపోయి ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేయడం వల్ల కేవలం ఆరుగంటల విశ్రాంతి శరీరానికి సరిపోదు అందుకే మనుషుల మానసిక స్థితి పనుల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కచ్చితమైన నిద్ర అలవాట్లను పాటించాలి

◆పగటి నిద్రకు దూరం

రాత్రి లేటయ్యిందని, ఉదయం ఇంకాసేపు ఎక్కువ పడుకోలేకపోయామనే సాకుతో పగటి పూట నిద్రపోతుంటారు దానివల్ల మళ్ళీ రాత్రి తొందరగా నిద్రపట్టకపోవడం ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుంది కాబట్టి పగటి నిద్రను మానేయాలి.

◆గోరువెచ్చని పాలు

రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల చక్కని నిద్ర మీ సొంతమవుతుంది. 

◆ఎలాంటి కాంప్రమైజ్ అవకండి

రాత్రిపూట ఏవైనా పనులున్నాయని నిద్రను ఆలస్యం చేయకండి. నిద్ర విషయం లో సమయాన్ని కచ్చితంగా ఫాలో అవ్వండి

◆వీటికి దూరముండాలి

పడకునే ముందు సాధారణంగా సినిమాలు సీరియళ్లు ప్రోగ్రాములు చూస్తూ వాటిలో భాగంగా హర్రర్, ట్రాజడి, థ్రిల్లర్ వంటివి చూడకండి నిద్రలో మనల్ని డిస్టర్బ్ చేస్తాయవి. అకస్మాత్తుగా మెలకువ రావడం లాంటివి జరిగేది వీటివల్లనే.

◆ఇలా చేస్తే మంచిది.

నిద్రించేముందు ఆహ్లాదకరమైన సంగీతం, లేదా మంచి పుస్తకం చదవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు

◆వీలైతే ఇలా చేయచ్చు

పడుకునే ముందు జరువెచ్చని నీటి స్నానం చేయడం వల్ల మంచి నిద్ర మీ సొంతమవుతుంది. ఇదొక చక్కని ఉపాయం కూడా.

◆వీటికి దూరం ఉండకపోతే మీ నుండి నిద్ర పారిపోతుంది

కాఫిలు, టీ లు కెఫిన్ ఉన్న పదార్థాలు, ఆల్కహాల్,సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల ప్రస్తుతానికి నిద్ర పట్టినా అది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారుతుందని మర్చిపోవద్దు.

పై చెప్పుకున్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల చక్కని నిద్ర మాత్రమే కాదు చక్కని ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది

Leave a Comment

error: Content is protected !!