Importance of sour Food For Us

ఆహారంలో పులుపు చేర్చుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటో తెలుసా……

మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తప్పనిసరిగా ఉంటాయి. ఈ మూడు రుచులను మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే కొందరికి పులుపంటే మహా ఇష్టం. ప్రతి దాంట్లో పులుపు జోడిస్తూ , కనీసం నిమ్మకాయ రసమైనా పిండుకుంటూ ఉంటారు. మరి పులుపును ఇలా ఆహారంలో విరివిగా జోడించడం వల్ల కలిగే లాభాలు నష్టాలు కూడా ఉంటాయి అవేంటో చూద్దాం మరి.

◆మనం తీసుకునే ఆహారంలో పులుపు కలవడం వల్ల ఆహారానికి కమ్మని రుచి కలుగుతుంది. పులుపు తగిన పాళ్లలో ఉండటం వల్ల ఆహారం జీర్ణమవడానికి దోహాధం చేస్తుంది. 

◆ పులుపు వల్ల శరీరం దృడంగా తయారవుతుంది, మరియు మెదడు చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మన శరీరంలో ఇంద్రియాల పటుత్వం పెరుగుతుంది.

◆ ఆహారంలో పులుపు భాగం అవ్వడం వల్ల మన శరీరంలో అధిక స్థాయిలో ఉన్న వాతం తగ్గిపోయి సాధారణ స్థాయికి వస్తుంది. అలాగే గుండె చల్లదనాన్ని పొందుతుంది.

◆ పులువు వల్ల అరుచి, ఆహారం జీర్ణం కాకపోవడం అనే సమస్యలు తొలగిపోతాయి. ఆకలి మందగించడం అనే సమస్య ఉన్న వారు పులుపును తీసుకోవడం వల్ల ఆకలి, తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవడంలో దోహదపడుతుంది.

◆ అయితే పులుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది.  దీనివల్ల శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే అవకాశం ఉంది.

◆ పులుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు తొందరగా పులిసిపోతాయి. దప్పిక పెరుగుతుంది, గొంతు ఆరిపోవడం జరుగుతుంది.  మగతగా మారి కళ్ళు మూతలు పడతాయి.

◆  శరీరంలో కఫము పెరిగిపోయి, వేడి ఎక్కువైపోతుంది. ఇలా వేడి మరియు కఫము పెరగడం వల్ల రక్తం మలినమై శరీర కండరాలు కుంపటి లాగా తయారయ్యి వేడిని పెంచుకుంటూ  అది క్రమంగా శరీరంలో అవయవాల పనితీరును దెబ్బతీసే స్థాయికి తీసుకెళ్తుంది.

◆ శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, గాయాలు దెబ్బలు తగిలినవారు పులుపును అదేపనిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వాపుకు గురై,  శరీరానికి తగిలిన గాయాలు, పుండ్లు ఇంకా ఎక్కువగా తయారవుతాయి.

◆ ముఖ్యంగా పులుపు ఎక్కువగా తీసుకుంటే రొమ్ముల్లో కఫము పేరుకుపోయి శీతం చేసి తుమ్ములు, జలుబు వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే గుండెకు కావాల్సిన వెచ్చదనాన్ని తొలగించి చలువ చేయడం వల్ల ఈ వ్యవస్థ పనితీరు కాస్త మందగిస్తుంది.

చివరగా…….

ఆహారంలో పులుపు ప్రధానమైనది అయినప్పటికీ ఒక నిర్ణీత మోతాదులో తీసుకుంటేనే అది ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. పరిధి మించి వాడితే పులుపు వల్ల కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదు.

2 thoughts on “ఆహారంలో పులుపు చేర్చుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటో తెలుసా……”

Leave a Comment

error: Content is protected !!