శ్రీరామనవమి వచ్చేసింది. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు రావణుని వధించి తిరిగి సీతారాములు కలిసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఈ మహోత్సవాన్ని గుర్తుగా సీతారాముల కళ్యాణం కూడా రాముల వారి గుడిలో చేస్తూ ఉంటారు. సీతారామ కళ్యాణం భద్రాచలం, ఒంటిమిట్ట వంటి ప్రదేశాలలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే వేల మంది భక్తులు ఈ ఉత్సవాన్ని చూడడానికి ఈ దర్శనీయ ప్రదేశాలు కి వెళుతుంటారు. ప్రతి శ్రీరామనవమికి గుడిలో సీత రాముల కళ్యాణం చేసి తర్వాత భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదంగా ఇస్తారు. ఈ వడపప్పు పానకం తీసుకోవడం వలన శరీరానికి చాలా మంచిదని మన పూర్వీకుల నుండి దీనిని ఇవ్వడం జరుగుతుంది.
శ్రీరామ నవమి పండుగ వచ్చే సరికి ఎండాకాలం మొదలవుతుంది. ఉదయం నుండి ఉపవాసం ఉండి కళ్యాణం జరిగేంత వరకు భక్తులు శ్రద్ధగా ఉండడం వల్ల శరీరం వడదెబ్బకు గురవకుండా ఈ ప్రసాదం ఇస్తారు. పానకంలో వాడే మిరియాలు, యాలకులు, బెల్లం శరీరాన్ని ఎండ నుండి కాపాడి చల్లబరచడంలో సహాయపడుతుంది. అలాగే ప్రసాదంగా ఇచ్చి వడపప్పు పెసరపప్పుని నానబెట్టి చేస్తారు.ళఇది శరీరానికి చలవ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది, మీకు ఎసిడిటీ లేదా గుండెల్లో మంట ఉన్నప్పుడు, ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వేసవి తాపానికి కూడా పెద్ద ఇలాచీ ఉపశమనం ఇస్తుంది.
ముఖ్యంగా వాతావరణం వేడిగా మరియు పొడిగా ఉండే భారతదేశం వంటి దేశాలలో, హీట్‌స్ట్రోక్‌లు చాలా సాధారణం. ఇలాచీ శరీరాన్ని చల్లబరుస్తుంది మరియుఎండ వేడి నుండి ఉపశమనం ఇస్తుంది. ప్రతి ఉదయం నల్ల మిరియాల పొడి, ప్రాధాన్యంగా ఖాళీ కడుపుతో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉత్తమ పరిష్కారం. ఈ మిరియాల నీటిని కనీసం ఒక నెల పాటు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అని చెప్పబడింది. బెల్లం అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, ఇది స్వీటెనర్‌గా ఉపయోగిస్తుంటారు.
కేవలం 20 గ్రాములలో 38 కేలరీలు ఉంటాయి మరియు 9.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9.7 గ్రాముల చక్కెర, 0.01 గ్రాముల ప్రోటీన్, కోలిన్, బీటైన్, విటమిన్ B12, B6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం మరియు మాంగనీస్ ఉన్నాయి. అందుకే ఎండాకాలంలో వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎండ వేడి నుండి కాపాడుకోవడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీపవర్ ను కూడా పెంచుకోవచ్చు.