Impressive Health Benefits Of Cucumber

ప్రతిరోజు ఈ జ్యుస్ ఒక్క గ్లాస్ తాగితే నమ్మలేని పలితాలు మీ సొంతం!!

కీరా దోస ఇష్టపడనిది ఎవ్వరు. కాసింత ఉపలు జల్లుకుని తింటే అద్భుతం, మిర్చి పేస్ట్ వేసి తింటే స్వర్గం. పచ్చడి, కూరలు, సలాడ్ లు వీటిలో దోసకాయ హడావిడి అంతా ఇంతా కాదు. దోసకాయ రసంలో విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్, రిబోఫ్లేవిన్, బి -6, ఫోలేట్, పాంతోతేనిక్ ఆమ్లం, ఐరన్, సిలికా, కాల్షియం మరియు జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. దోసకాయ తినడం కంటే కూడా జ్యుస్ చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్కసారి చూడండి.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

దోసకాయ రసం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది అందువల్ల జీవక్రియను పెంచుతుంది మరియు బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.ఇది కేలరీలు తక్కువగా ఉంటుంది  కాబట్టి అధిక బరువు ఉన్నవారికి గొప్ప ప్రయోజనం చేకూరుస్తుంది. 

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది 

దోసకాయ 95% నీరు కలిగి ఉంటుంది. అంతేకాదు ఆ 95% లో  ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కెఫిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం తేమను కోల్పోకుండా చేస్తుంది మరియు టాక్సిన్ లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. 

మలబద్ధకం నుండి ఉపశమనం

దీని రసం ప్రేగుపై తేలికగా ప్రభావితం కలిగి ఉంటుంది., ఇది సహజంగానే  మలవిసర్జన సాఫీగా జరిగేందుకు దోహాధం చేస్తుంది.  అంతేకాదు దీర్ఘకాలిక మలబద్ధకానికి నివారణగా కూడా ఉంటుంది. ఇందులోని ఫైబర్ కూడా అద్భుతంగా జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో తోడ్పడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

 ఆయుర్వేద పరంగా చూస్తే దోసకాయ రసం శరీరానికి మొత్తం ఖనిజాలు, హార్మోన్లు మరియు సమ్మేళనాలను అందిస్తుంది, ఇది  శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.  ఇందులో సమృద్ధిగా  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  వైరల్ వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుంది. 

శరీరాన్ని శుభ్రం చేస్తుంది

నీరు  అధికంగా ఉండటం వల్ల, దోసకాయ రసం విషపూరితమైన మరియు పాత వ్యర్థ పదార్థాలను తొలగించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.  ఇది శక్తివంతమైన డిటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది.  

రక్తపోటును నియంత్రిస్తుంది

దోసకాయ రసం శరీర సరైన పనితీరును ప్రోత్సహిస్తుంది.  ఇందులో  మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున  అధిక మరియు తక్కువ రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది

శక్తిని పెంచుతుంది

ఇది మంచి పోషణను అందిస్తుంది. మరియు బి విటమిన్ల యొక్క అద్భుతమైన మూలం.  బి విటమిన్ల లోపం తరచుగా అలసట, చిరాకు మరియు ఏకాగ్రతకు దారితీస్తుంది.  దోసకాయ రసం తాగడం వల్ల శరీరానికి ఈ విటమిన్లు సరఫరా అయ్యి మానసికంగా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.  

నిద్రను మెరుగుపరుస్తుంది

నిద్రలేమితో బాధపడేవారు దోసకాయ రసం తాగడం వల్ల  నరాలను విశ్రాంతిని చేకూరుస్తుంది. మానసిక ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.  నిద్ర మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

శరీరాన్ని చల్లబరుస్తుంది 

దోసకాయ రసం మొత్తం అధికంగా నీటి శాతమే ఉన్నందున, ఇది సహజ శీతలకరణిగా పనిచేస్తుంది. వేసవి కాలంలో తాగవలసిన అద్భుతమైన పానీయం.

కంటి చూపును మెరుగుపరుస్తుంది

కంటి చూపు మెరుగుపరచాలనుకుంటే దోసకాయ రసం తాగడం ఉత్తమ మార్గం. కంటి చూపును మెరుగుపరచడంలో ఇది చాలా ఉపయోగకరమైనది. 

చర్మానికి మంచిది

దోసకాయలు సిలికా యొక్క అద్భుతమైన మూలం. అందం లో ఒక భాగమైన చర్మ సంరక్షణలో దోసకాయ అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.  దోసకాయ ముక్కలను కళ్ళ మీద ఉంచడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు మరియు కళ్ళ కింద ఉబ్బిన చర్మాన్ని తొలగస్తుంది. దోసకాయ రసం తాగడం వల్ల లోపలి నుండే ఆరోగ్యకరమైన చర్మం లభిస్తుంది.  ఇందులో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు అంతర్గతంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది.  ఇందులోని యాంటీఆక్సిడెంట్ స్థాయిలు దీనికి కారణం, ఇవి శరీరంలో మంటను తగ్గించి ఎర్రబడిన మరియు ఉబ్బిన చర్మాన్ని సాధారణ స్తాయిలోకి తీసుకువస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఇందులో సిలికాన్ మరియు సల్ఫర్ కలిగి ఉండటం వల్ల  జుట్టు రాలడాన్ని ఆపివేస్తుంది మరియు ఆరోగ్యకరమైన జుట్టు ఒరుగుదలకు దోహాధం చేస్తుంది.

చివరగా…..

కీరదోస రసం రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల పై ప్రయోజనాలే కాకుండా యాంటీ ఏజింగ్ గా పనిచేసి యవ్వనంగా ఉంచడంలో దోహదపడుతుంది

Leave a Comment

error: Content is protected !!