మన శరీరంలో ముఖ్యమైనది రక్షక వ్యవస్థ. దీనిలో దళాలు ఉన్నాయి వీటినే రక్షక దళాలు అంటారు. రక్షక దళాలు ఐదు రకాలుగా ఉంటాయి. దేశాన్ని కాపాడే మూడు దళాలు ఉన్నట్లుగా మన శరీరంలో కూడా 5 దళా లు గ విభజింపబడి ఉన్నాయి. అవి మోనోసైట్లు, ఈసినోఫిల్ , బాసోఫిల్స్, లింపోసైట్స్, న్యూట్రోఫిల్స్. ఇవి ఐదు రకాల రక్షక దళాలు గా పిలవబడతాయి. ఇవన్నీ పది పదిహేను రోజుల లోపల చనిపోతాయి చనిపోయిన వాటి ప్లేస్ లో కొత్తవి ఉత్పత్తి అవ్వాలి.
పాత వాటి ప్లేస్ లో కొత్తవి రీ ప్లేస్ అవ్వాలి అంటే బోన్‌మ్యారో లో తయారవుతాయి. బోన్ మారో ఎక్కువ సంఖ్యలో ఎక్కువ కణాలు, ఆరోగ్యమైన కణాలను ఉత్పత్తి చేయాలంటే మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ ఏ విటమిన్ కె క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.ఈ మూడు తీసుకున్నట్లయితే రక్షక కణజాలం బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ మూడు అధికంగా మునగాకులో ఉంటాయి. 100 గ్రాములు మునగాకులో 448 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
పాలు కంటే నాలుగు వంతులు ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుంది. అలాగే విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. 7000 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ కలిగి ఉంటుంది. పూర్వం కూరలు ఏమి లేకపోవడంతో మునగాకు వండుకుని తినేవారు. వాళ్ళకి మునగాకులోని పోషక విలువలు తెలీకుండా తిన్నా వాళ్ళకి మంచే జరిగేది. ప్రతి ఒక్కరు వారంలో రెండు మూడు సార్లు వండుకుని తింటే చాలా మంచిది. మునగాకును కందిపప్పు మూడు వంతులు ఉడికించి డ్రై గా ఫ్రైలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మన లేకుండా శుభ్రంగా కడిగి పుల్కా పిండిలో కలుపుకొని చేసుకున్న చాలా బాగుంటుంది.
మునగాకు ఉడికించుకొని కషాయం చేసుకుని తాగితే చాలా మంచిది. ఆకుకూరలు వండేటప్పుడు అట్ల కలిపి కూడా ఉండకపోవచ్చు. మునగాకు రసం తీసి అన్న ఉడికేటప్పుడు లేదా కూరలలో కూడా కొంచెం వేసుకోవచ్చు. మునగాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్మ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. పూర్వ అయితే పట్టణాల్లో మునగాకు దొరికేది కాదు. కానీ ప్రస్తుతం అన్ని చోట్ల మార్కెట్లో ఆకుకూరలు అమ్మేవాళ్ళు మునగాకు కూడా అమ్ముతున్నారు. మీరు కూడా మునగాకును ఆహారంలో భాగంగా చేసుకొని శరీరంలోని రక్షణ రక్షణ వ్యవస్థ ని పటిష్టం చేసుకోండి.