improve your immunity power with this root

కేవలం 1 గ్రామ్ ఇది తీసుకుంటే చాలు మీ ఇమ్మ్యూనిటి రెట్టిపవుతుంది మీకు గొంతునొప్పి,ఇన్ఫెక్షన్స్ రావు

శీతాకాలంలో జలుబు, దగ్గుతోపాటు గొంతునొప్పి కూడా చాలా ఇబ్బందిపెడుతుంది. పిల్లల్లో టాన్సిల్స్ ఉంటే ఈ బాధ వర్ణనాతీతం. మామూలుగా అయితే వైరల్ లేదా బాక్టీరియా ఇన్పెక్షన్ వలన వస్తుంది. కొన్ని సార్లు ఏ ఇన్పెక్షన్ లేకపోయినా రావచ్చు. దీనివలన మాట బొంగురు పోవడం , మాట్లాడుతుంటే గొంతులో నొప్పి రావడం ఉంటుంది. గుటకవేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు మింగలేక ఇబ్బంది పడుతుంటాం. ఆహరంలో ఒక్కటి చేర్చడం ద్వారా గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. దానికోసం మనకు కావలసింది అతిమధురం.దీనినేలికోరైస్ అని కూడా అంటారు.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..

 గొంతుకు సంబంధించిన అన్నిరకాల వ్యాధులకు అతిమధురాన్ని  చికిత్స లో ఉపయోగిస్తారు. శరీరంలో వాత,పిత్త రోగాలను నయంచేయడంలో సహాయం చేస్తుంది. ఈ మొక్క వేరునే చికిత్స ల్లో ఉపయోగిస్తారు. ఈ వేరు తియ్యటి రుచి కలిగి అద్బతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఆయుర్వేద షాపులతో పాటు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీనిలో యాంటిబయోటిక్స్ కూడా చాలా ఉంటాయి. దీనివలన గొంతుఇన్పెక్షన్ లు త్వరగా తగ్గిపోతాయి. ఒక రెండు వందల గ్రాముల నీటిలో ఒకస్పూన్ అతిమధురం పొడి వేసి మరిగించి అందులోనే అల్లం ఇంచుముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి.అల్లంలో కూడా గొంతునొప్పి ని తగ్గించే లక్షణాలు ఎక్కువ. 

డయాబెటిస్ ఉన్నవారు అతి మధురం తీసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ ను సంప్రదించండి. మూడు నిమిషాలు మరిగాక సైంథవ లక్షణం అరచెంచా కలపండి. కిచెన్ సాల్ట్ వాడొద్దు. ఈ నీళ్ళు బాగా మరిగాక చల్లార్చుకుని వడకట్టుకోవాలి. ఈ నీటిని  టీ తీసుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున ఒకసారి, మధ్యాహ్న భోజనం,రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత ఈ టీని తీసుకోవాలి. ఈ టీ వలన గొంతునొప్పి, ఊపిరి తిత్తులలోని కఫాన్ని కరిగిస్తుంది. దీనివలన గొంతునొప్పితో పాటు గొంతువాపు, పూతను కూడా తగ్గిస్తుంది. ఈ నీటిని తాగడంతో పాటు పుక్కిలిస్తే త్వరగా గొంతునొప్పి తగ్గుతుంది. గొంతునొప్పి ఉన్నప్పుడు పాలు, పాలసంబంధ పదార్థాలు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. మెత్తటి జావలు, మజ్జిగ, పులుసులు తినాలి.ఈ జాగ్రత్తలు పాటిస్తూ అతిమధురం టీని తాగడంవలన మంచి ఫలితాలు ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!