పెరిగిపోతున్న కాలుష్యం, మనపట్ల మనకు లేని శ్రద్ధ వలన చర్మం కాంతి విహినంగా తయారవుతూ ఉంటుంది. వయసులో ఉన్నవారు, మధ్య వయసువారు కూడా చర్మం కాంతివంతంగా మారడానికి పార్లర్లకి , ప్రోడక్ట్స్ కి వేలు పోస్తుంటారు. అంతేకాకుండా దీనికోసం అనేక చిట్కాలు పేపర్లు, ఆన్లైన్లో చూసి ఫాలో అవుతూ ఉంటారు. కానీ అవన్నీ సైంటిఫీకల్లీ టెస్టెడ్ కాదు. కానీ సైన్స్ నిర్థారించిన ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికోసం మనం తీసుకోవలసిన పదార్థాలు రెండే అవి. ఒకటి శొంఠి పొడి. శొంఠి పొడి అంటే ఇప్పటితరంలో చాలామందికి తెలియకపోవచ్చు. అల్లాన్ని ప్రత్యేక పద్థతిలో ఉడికించి ఎండబెట్టడం వలన తయారు చేస్తారు. దీనిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శొంఠిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలు రాకుండా అడ్డుకుంటాయి.
అంతేకాకుండా ఇది చర్మానికి కూడా మేలు చేస్తుందని పరిశోధనలలో తేలింది. ఈ శొంఠిని పొడి చేసి మెత్తటి పొడిలా అయ్యేలా జల్లించుకుని ఆందులో ఉండే పీచులాంటి పదార్థాలు తీసేయాలి. ఈ మెత్తని పొడి గాజుసీసాలో నిల్వచేసుకోవాలి. నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకుని అందులో ఈ పొడి రెండు స్పూన్లు వేసి నీళ్ళు రెండు గ్లాసులు అయ్యేంతవరకూ మరిగించాలి. అలా మరిగించిన నీటిలో రెండు స్పూన్లు లావెండర్ ఆయిల్ వెయ్యాలి.
ఈ నీటిని చల్లారాక ఫ్రిజ్ లో కనీసం నాలుగుగంటల పాటు ఉంచాలి. తర్వాత చర్మానికి ఎక్కడైతే దుమ్ము,ధూళి చేరి నిర్జీవంగా అనిపిస్తుందో అక్కడ దూదితో ఈ ద్రవాన్ని పూయాలి. అరగంట తర్వాత నీటితో కడిగేయొచ్చు. ఇందులో వాడిన పదార్థాలు వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
చర్మసమస్యలకు, నిర్జీవంగా మారడానికి కారణమైన మృతకణాల్ని తొలగించి చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. ఈ ద్రవాన్ని అంతా ఒకసారే ఉపయోగించలేం కనుక ఫ్రిజ్లో పెట్టి వాడుకోవచ్చు. ఒకసారి బయట పెట్టుకుని రూం టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వాడుకోవచ్చు.