ఈరోజుల్లో ఆటాడుకుంటూ దేన్నైనా గుద్దుకుంటేనే ఎముకలు విరిగిపోతున్నాయి. కొంచెం జారిపడినా కాళ్ళు విరిగిపోతున్నాయి. మరి ఇంత బలహీనంగా ఎముకలు గుల్లబారడానికి కారణం లవణాలు చేరకపోవడం. కాల్షియం ఎముకలకు అందవలసిన రీతిలో అందకపోవడం. ఎముకలకు లవణాలు, మినరల్స్ పట్టకపోవడమే కారణం. ఎముకలు బలహీనంగా చాక్ పీస్ అంత ఈజీగా విరిగిపోవడానికి కారణమవుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి ఏం చేయాలి.
ఆర్థియోపోరోసిస్ వలన ఎముకలు గుల్లబారతాయి. ఎముకలు ఇలా తయారవడానికి కారణం మనం చేసే తప్పులు. ఎముకల సాంద్రత పెంచి మళ్ళీ గట్టిగా తయారుచేసేది ఏమైనా ఉందా అంటే ఉంది అదే అల్ బఖరా పండు. కొంచెం పుల్లపుల్లగా ఉండే ఈ పండు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రోజుకు రెండు తింటూ ఉంటే ఇందులో ఉండే రసాయన సమ్మేళనాలు మూలంగా ఎముకలు సాంద్రత పెరుగుతుంది. గుల్లబారకుండా గట్టిగా తయారవుతాయి. లవణాలు ఎముకలను పట్టి మూడునెలల్లోనే ఎముకలు గట్టిపడినట్టు పరిశోధకులు చెప్తున్నారు.
ఎముకలు బలంలేనప్పుడు చిన్నపిల్లలకు పెద్ధవారికి ఈ పండ్లు రోజుకు రెండు తినిపించండి. తాజాగా దొరకనప్పుడు ఎండినవి కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఇవైనా రోజుకు నాలుగు చప్పరించవచ్చు. శరీరంలో ఇన్సులిన్ ని పెంచుతుంది. ఎముకలకు కాల్షియం చేరవేసేందుకు సహాయపడుతుంది. అలాగే రోజుకు శరీరానికి 600గ్రాముల కాల్షియం కావాలి. దానికోసం రోజూ భోజనం తర్వాత ఒక నువ్వులుండ తినండి. ఆహారంలో తోటకూర, మెంతికూర, పొన్నగంటికూర తినడం వలన శరీరానికి తగినంత కాల్షియం దొరుకుతుంది.
నువ్వులుండ, ఆకకూరలు తీసుకోవడంవలన పోట్టలోకి చేరే కాల్షియంని ఎముకలు గ్రహించాలంటే విటమిన్ డి ఉండాలి. ఉదయం పదిగంటల నుంచి రెండు లోపు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ లోపం ఉంటే డాక్టర్ సలహాతో విటమిన్ డి టాబ్లెట్లు వాడొచ్చు. ఈ అల్బఖరా పండు కాల్షియం ఎముకలకు చేరేటట్టు చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.
ఎముకలు బలంగా ఉక్కులా ఉండేందుకు ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు ఉపయోగించాలి. సిట్రస్ పండ్లలానే విటమిన్ సి లభిస్తుంది. మంచికొలెస్ట్రాల్ పెరిగి చెడుకొలెస్ర్టాల్ తగ్గుతుంది. మెటబాలిజం రేట్ పెరుగుతుంది. తాజాగా దొరకనప్పుడు ఎండినవి తెచ్చుకుని నానబెట్టి తింటూ ఉండండి.