Improves Nerves Strength Controls Fits

ఈ భూమి మీద ది బెస్ట్ డ్రింక్ ! ఫిట్స్ ని కంట్రోల్ చేస్తుంది…

ఫిట్స్ అంటే మూర్చ వ్యాధి ఇది కొంతమందికి ఐదారు రోజులకు వస్తే కొంతమందికి రేర్ గా వస్తాయి. ఈ ఫిట్స్ వ్యాధిని నివారించడానికి చూస్తే స్పెషల్ గా తుంగమస్తలు బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్ గా ఎలుకలపై నిరూపించారు. 2018 లో బంగడున్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫార్మకాలజి ఇండోనేషియా వారు పరిశోధన చేశారు. ఈ తుంగమస్తలు ఇవి గడ్డి జాతి మొక్కలు వీటివేర్లకి చిన్న చిన్న కాయల్లాగా కాస్తాయి. ఈ తుంగ గడ్డంలో నాలుగు రకాల సేస్క్వైటర్పెన్స్ మరి ఒక ట్రై టర్పెన్స్ ఉండడం వల్ల ఇది మెదడులోకి వెళ్లి బాబా హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. మెదడు బాగా చురుగ్గా ఒత్తిడికి తక్కువగా గురి అవుతారు.

                   ఈ కెమికల్ కాంపౌండ్స్ న్యూరో ప్రొటెక్టివ్ గా బాగా ఉపయోగపడుతున్నాయి. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే మనకి డ్రై ఫామ్ లో తుంగ గడ్డలు మార్కెట్లో అమ్ముతారు. వీటిని తెచ్చి పౌడర్ చేసి ఒక పది గ్రాములు పొడిని తీసుకుని 100 ml వాటర్ లో మరిగించాలి డికాషన్ల చేసుకుని తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు. అలాగే పార్కిన్ సన్ వ్యాధితో బాధపడే వారికి డోపమిన్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి వారికి కూడా తుంగ గడ్డ  డోపమిన్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ విధంగా పార్కిన్ సన్ వ్యాధి ఉన్నవారికి కూడా ఇది బాగా పని చేస్తుందని నిరూపించారు.

                     ఫిట్స్ తో బాధపడేవారు తుంగమస్తల పొడిని తీసుకోవడంతో పాటు మెడిసిన్ ని మానకుండా వేసుకోవాలి. ఇలా వాడుకుంటేనే ఆ సివియారిటీ కంట్రోల్ లో ఉంటుంది. ఈ ఫిట్స్ తో, పార్కిన్ సన్ తో బాధపడేవారు ముఖ్యంగా రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగుతూ ఉండాలి. బ్రెయిన్ కి ఆ సెల్స్ కుచించుకు పోకుండా హెల్దీగా ఉండాలి అంటే మంచినీళ్లు బాగా తాగాలి. ఇక రెండవది ప్రాణాయామం రెగ్యులర్ గా చేయాలి. ఉదయం సాయంత్రం పావుగంట నుండి  20 నిమిషాలు చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ఒక అరగంట మెడిటేషన్ చేయాలి. ఇలా మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది.

                     ఉదయం సాయంత్రం న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తినాలి. ఇలా చేస్తే బ్రెయిన్ అనేది కంప్యూటర్ల లా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!