దేశంలో ఆక్సిజన్ కొరత ఎలా ఉందో మనందరికి తెలిసిందే. మరోపక్క కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరో దారి లేదు. కరోనా రాకముందే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఆక్సిజన్ లెవెల్స్ నియంత్రణలో ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా సోకితే కృత్రిమ శ్వాస అందించవలసి వస్తుంది. అందుకే మీ శరీరంలో రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలి. మొదట ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఆవిరి పట్టడం మంచి పద్థతి.
ఇలా ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తులు గాలి తీసుకునే మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని అందులో అర స్పూన్ వాము వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ నీటిని బాగా మరిగించాలి. నీటి నుండి ఆవిరి వచ్చేంత వరకు నీటిని మరిగించాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక టవల్ చుట్టుకొని ఆవిరిపట్టాలి. మీ ఇంట్లో స్టీమర్ ఉంటే అందులో వాము, పసుపు వేసి ఆవిరి పట్టవచ్చు. ఆవిరి పట్టడం వలన ఊపిరితిత్తులు లోపలి వరకు శుభ్రపడటమే కాకుండా ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం కూడా కరిగిపోతుంది. ఇలా ఆవిరి పట్టేటప్పుడు మీరు కళ్ళు మూసి ఉంచండి. ముక్కుతో గాలి పీల్చుకుంటూ ఉండాలి.
అలాగే నోరు తెరిచి కొంచెం పిలుస్తూ ఉండండి. ఆవిరి పీల్చడం వల్ల ఇది నోరు, ముక్కు ద్వారా ఊపిరితిత్తులకు చేరి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చి బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. చుక్కకూర, తోటకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు కూడా బాగా శుభ్రం చేస్తుంది. అన్ని రకాల ధాన్యాలను కూడా తీసుకోవాలి. జొన్నలు, సజ్జలు వంటి చిరు ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అందుబాటులో ఉండే ఏవైనా రోజుకి రెండు రకాలైన కలిపి తీసుకోండి. నీటిని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సన్ ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు, నువ్వులు వంటి గింజలు తీసుకోవాలి.
ఏదైనా పరిమితంగానే తీసుకోవాలి. ఈ ధాన్యాలు శరీరంలో ఐరన్ పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా రెట్టింపు చేస్తాయి. అలాగే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి వ్యాయామం చేయడం బాగా పనిచేస్తుంది. దీని వలన శరీరంలో ఉండే వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. దీని ప్లేస్ లో ఆక్సిజన్ అనేది భర్తీ చేస్తుంది. మన శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీటిని తాగండి. శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. ఘనహారాల కంటే ద్రవ ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివలన మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది.