మొదటి చిట్కా మన పూజ గదిలో ఎక్కువగా దీపం పెట్టడం కోసం నూనె ను ఉపయోగిస్తుంటాం కాకపోతే నూనెలో వంపడం వలన డబ్బా జిడ్డుగా అయిపోతుంది. చేత్తో పట్టుకుని వేయడం వలన చెయ్యి మొత్తం కూడా జిడ్డు అంటుకుంటుంది. అలాంటి వాటి కోసం డిస్పోజబుల్ హ్యాండ్ కవర్స్ కట్ చేసుకుని నూనె డబ్బాకి చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసుకువాలి. ఇలా చేయడం వలన డబ్బా జిడ్డు చేతికి అంటుకోకుండా ఉంటుంది.
రెండవ చిట్కా దీపం పెట్టినపుడు నూనె పెద్ద డబ్బాలు లేదా వెడల్పుగా ఉన్నవాటితో నూనె వేయడం వలన అటు ఇటు పడిపోవడం, ఎక్కువ పడిపోవడం జరుగుతుంది. చిన్నగా ఉండే శానిటైజర్ బాటిల్ శుభ్రంగా కడిగి వాటిలో నూనె వేసి పెట్టుకుంటే ప్రమిదలో వేసుకున్నప్పుడు అటు ఇటు పడటం, నూనె ఎక్కువ పడటం ఉండదు. మనకి కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
మూడవ చిట్కా హారతి ఇవ్వడం వలన హారతి ఇచ్చే ప్లేట్ నల్లగా ఐపోతుంది. హారతి ఇవ్వడానికి ముందు ప్లేట్ లో కొంచెం విబూది వేసి హారతి ఇవ్వడం వలన ప్లేట్ నల్లగా అయిపోకుండా ఉంటాయి. లేదా హారతి ప్లేట్ లో మట్టి ప్రమిద పెట్టి హారతి ఇవ్వడం వలన కూడా ప్లేట్ నల్లగా అవ్వకుండా ఉంటుంది.
నాల్గవ చిట్కా పూజ చేసినపుడు అగరబత్తెలు వెలిగిస్తూ ఉంటారు. ఆ బూడిద ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అంటుకుంటుంది. అగరబత్తెల స్టాండ్ ప్లేటులో పెట్టి వెలిగించడం వలన ఆ బూడిద కింద పడకుండా ఉంటుంది. మనకి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది.
ఐదవ చిట్కా సునీత కలపడం వల్ల పల్చగా అవుతుంది పసుపు ఒక చెంచా పెరుగు ఒక చెంచా నీళ్లు వేసి కలుపుకుంటే చిక్కగా ఉంటుంది.
6 వ చిట్కా దేవుడి పూజ సామాన్లు నల్లగా అయిపోయి ఉంటాయి. వాటిలో షాంపు వేసి నిమ్మచెక్కతో రుద్దడం వలన అవి మునుపటిలాగా మెరుస్తాయి.
ఏడవ చిట్కా దేవుడి దగ్గర దీపం పెట్టిన వేసినప్పుడు చేతితో సరిచేయడం వలన చేయి మొత్తం జిడ్డు అయిపోతుంది. అలా కాకుండా ముందు ఒక బాక్స్ లో ఒత్తులు వేసుకుని అందులో కొంచెం నూనె వేసి నానబెట్టి పూజ చేసుకున్నప్పుడు అగ్గిపుల్లలతో తీసి డైరెక్ట్ వేసి సరిచేసుకొని వెలిగించుకోవచ్చు.
ఎనిమిదవ చిట్కా దేవుడు ఫోటోలకు బొట్లు పెట్టేటప్పుడు కాలిపోతుంటే అలా కాకుండా కలిపి ఇయర్ బడ్ తో పెట్టడం వలన కారిపోకుండా నీట్ గా ఉంటాయి.
9 వ చిట్కా దేవుడు పూజ అయిన తరువాత ఎండిపోయిన పువ్వులు వేసి పడేయాల్సినవి ఒక గిన్నె పెట్టి అందులో వేసి వారానికి ఒక సారి తీసి పడేయడం వల్ల పూజగది చిరాకుగా అవ్వకుండా ఉంటుంది.
10 వ చిట్కా న్యూస్ పేపర్స్ వేయడం వల్ల పూజ చేసుకునేటప్పుడు న్యూస్ కనిపిస్తే మనకు చిరాకుగా అనిపిస్తుంది. అందుకే పుస్తకాలకు వేసుకునే అట్టలు వేయడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు.
11వ చిట్కా పూజ గదిలో చేతిలో చూసుకోవడానికి ఒక ఆప్షన్ పెట్టుకోవాలి పెట్టుకోలేము అనుకున్నవారు ఏదైనా పేపర్ ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవలెను. అవసరం అయినప్పుడు చేతులు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది.