ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. బయట వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి, అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం సమస్య ప్రతి ఒక్కరు లో చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్య తగ్గించుకోవడం కోసం రకరకాల ఆయిల్స్, ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. మనకి నాచురల్గా దొరికే వాటితో నాచురల్ పద్దతిలో జుట్టు రాలడాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు.
దీనికోసం ముందుగా పది రేఖ మందార పువ్వులు తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత నానబెట్టిన మందార పువ్వులను నీటితో సహా స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. మందార పువ్వులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు నల్లగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. తర్వాత దీనిలో ఒక చెంచా మెంతులు వేసుకోవాలి. మెంతులు జుట్టు రాలడాన్ని, చుండ్రు, దురద వంటి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. దీనిలో ఒక చెంచా లవంగాలు కూడా వేసుకోవాలి.
లవంగాలు కొత్త జుట్టు రావడంలో అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది. చుండ్రు, దురద కూడా తగ్గిస్తుంది. 10నిముషాల పాటు ఈ నీటిని మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. వడకట్టుకున్న నీటిని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. చేతితో లేదా స్ప్రే బాటిల్ తో లేదా ఏదైనా కాటన్ తో కూడా అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసిన తర్వాత అరగంట పాటు మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోమ్ మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఈ చిట్కా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు మృదువుగా, సైనీగా కూడా ఉంటుంది. ఈ చిట్కా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.