indian-toilet-vs-western-toilet

టూ… మచ్ ఈ టాయిలెట్స్!!

టాయిలెట్ గూర్చి ఏం  చెబుతాం యాక్ అనుకుంటారు కానీ, మన రోజు వారీ జీవితంలో  ఆ టాయిలెట్ లేకపోయినా అక్కడ మన కాలకృత్యం సరిగా లేకపోయినా రోజంతా అసహనంగా ఉంటుంది. ఉదయం లేవగానే మన కడుపు భారం తగ్గకపోతే రోజంతా ఏం తినాలన్నా, తాగాలన్నా కడుపు ఉబ్బరంగా ఉంటూనే ఉంటుంది. 

                ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పినట్టో… అని మీరనుకుంటారు కానీ నేను ఎందుకు చెబుతున్నానో తెలిస్తే నాతో ఏకీభవిస్తారండోయ్.

        చిన్నపుడు యేటి గట్టున, బావి గట్టున వెళ్లి పనులు కానిచ్చుకొచ్చే బాల్యం తరువాత కాసింత పెద్దయ్యాక ఇంట్లోనే అలవాటు అయ్యాము, అలాగే మనం పెరుగుతున్నట్టే ఆ టాయిలెట్ లలో కూడా బోలెడు మార్పులు వచ్చాయ్ ఇంతకు మీకు అర్థమైందా లేదా?? అదేనండి ఇపుడు ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ దర్శనమిస్తున్నాయి. 

                      వయసైపోయిన పెద్దవాళ్లకు అయితే మోకాళ్ళ నొప్పులు, గుండె ఆపరేషన్ లు జరగడం వల్ల వాళ్ళకు మన ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ ఉపయోగించడం ఇబ్బందిగా ఉంటుంది కానీ వయసులో ఉన్నవాళ్లు కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల చాలా సమస్యలే ఎదుర్కుంటున్నారండోయ్ ముఖ్యం గా ఇప్పటి తరం మలబద్దకం  కు గురవ్వడానికి  కారణం వెస్ట్రన్ టాయిలెట్స్ ఏ. 

ఉపాసన కొణిదల గారు  కూడా ఇండియన్ టాయిలెట్ మంచిదని ప్రమోట్ చేస్తున్నారు…

                 దానికి దీనికి ఏంటి సంబంధం అంటారా అక్కడికే వస్తున్నా!!  ఇండియన్ టాయిలెట్ పోజ్ లో మనం మోకాళ్ళు మడిచి కూర్చోవడం వల్ల తొడ కండరాలు  మరియు పాదాల బిగువు వల్ల శరీరంలో పటుత్వం వస్తుంది, అంతే కాదు ఇండియన్ స్టైల్ టాయిలెట్ వల్ల కడుపులో జీర్ణాశయపు ఇరువైపు కండరాలు సంకోచం వ్యాకోచాల ప్రక్రియ వల్ల మన పేగుల్లో మిగిలిన  వ్యర్థ పదార్థం అనబడే మలం సాఫీగా విసర్జించబడుతుంది. 

        ఉదయం లేవగానే మన కాలకృత్యం ఆ వెస్ట్రన్ టాయిలెట్ లో స్టైల్ గా చైర్ లో కూర్చున్నట్టు జరిగిపోతుంది, స్నానం అయ్యాక టిఫిన్ చేసేటపుడు డైనింగ్ టేబుల్ మీద పూర్తవుతుంది. పిల్లలు బడికి పోతే బెంచ్ లలో కూర్చుని పాఠాలు వినడం, పెద్దలు అయితే చైర్ లలో సిస్టం ముందు కూర్చుని  వర్క్ చేసుకోవడం. బస్సుల్లో, కార్ లలో, బైక్ లలో ఎక్కడ చూసినా అదే పొజిషన్. స్నేహితులతో బయటకు వెళ్తామా….హోటల్స్ లో, కేఫ్ లలో, పార్కులలో ఎక్కడ చూసినా అదే భంగిమ. సాయంత్రం కు రాత్రికి అలసి, సొలసి ఇంటికి వచ్చాక కాసింత తిని నిద్రపోతే మళ్ళీ ఉదయం అదే దినచర్య. 

             కొందరైతే వర్కౌట్ పేరిట అరగంట సేపు హడావిడిగా పుషప్స్, క్రంచెస్, వాకింగ్, రన్నింగ్ అంటూ అన్ని కలిపి చేసేస్తారు కానీ ఉదయం కాలకృత్యం తీర్చుకునే సమయంలో మనం ఇండియన్ స్టైల్ టాయిలెట్ లో మన పని ముగిస్తే మన కడుపు కండరాల పనితీరు మెరుగుపడి పేగుల పనితీరు చురుగ్గా  ఉండటమే కాదు ఉదయాన్నే అదొక ఎక్సర్సైజ్ కూడా. 

చివరిగా ..

           ఇప్పుడు అర్థమైందా?? టాయిలెట్ అంటే మాట్లాడకూడని పదం కాదు, మారిపోతున్న మన కల్చర్ లో మార్చుకోకూడని ఒక పద్ధతి. 

Leave a Comment

error: Content is protected !!