indian traditional remedies for hair growth

జేజమ్మ ల కాలం నాటి హెయిర్ గ్రోత్ టిప్స్, ఈ టిప్స్ ఉపయోగించినట్లయితే జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, అనారోగ్యం వలన  జుట్టు రాలడం, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉపయోగించి ఉంటారు. కానీ వాటిలో కెమికల్స్ ఉండడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఈ సమస్యలన్నిటినీ తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా  పొట్లం టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా మందికి తెలిసి ఉండదు. 

     ఒకసారి తెలిసినట్లయితే  దీని రిజల్ట్ చూసి కావాలని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తూ ఉంటారు. దీని కోసం ముందుగా మనం ఒక చెంచా మెంతులు, ఒక  చెంచా లవంగాలు తీసుకొని ఒక కాటన్ క్లాత్లో మూట కట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇనుప కడాయి   పెట్టుకొని ఈ మూటను దానిపై ఒత్తుతూ వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేయడం వలన మెంతులు మరియు లవంగాలులో ఉండే పోషకాలు అన్ని బయటకు వస్తాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ల దగ్గర ఒత్తుతూ ఉండాలి. 

        ఇలా చేయడం వలన జుట్టు కుదుళ్ళు దగ్గర బ్లడ్  సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ టిప్ ప్రతి రోజు చేసుకోవచ్చు. జుట్టు రాలడం తగ్గించే మరొక చిట్కా 2 అంగుళాల అల్లం  ముక్క తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చెంచా మెంతులు రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి. ఈ రెండిటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని వడకట్టుకుని లేదా డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. మెంతులు జుట్టు రాలడం తగ్గించి,   జుట్టు కుదుళ్లను మాయిశ్చరైజ్ చేసి  జుట్టు కుదుళ్ల నుండి   బలంగా చేయడంలోనూ సహాయపడతాయి.

       అల్లంలో ఏంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో చుండ్రు  తగ్గించి జుట్టు రాలడం  కూడా తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి.  అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడంలో  కూడా ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని హెయిర్ టానిక్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని డ్రాపర్  లేదా  చేతి సహాయంతో జుట్టు కుదుళ్ల దగ్గర స్ప్రెడ్  చేసి అయిదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఒక గంట  తర్వాత ఏదైనా హోమ్ మేడ్ షాంపూతో తలస్నానం చేయాలి.

       ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా అయ్యి   జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాలు అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

error: Content is protected !!