indian women behaviour at home as per hindu culture

ఇలాంటి స్త్రీ మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికి మీ ఇంట్లో అడుగు పెట్టదు

స్త్రీలు లక్ష్మీ స్వరూపం అని చెబుతూ ఉంటారు. అలాంటి స్త్రీలు ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతారు. కానీ నేటి కాలంలో అవి మూఢనమ్మకాలుగా భావించి పట్టించుకోము. కానీ స్త్రీలు తమకు తెలియకుండా చేసే కొన్ని పనులు ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్రా దేవి ఇంట్లో చేరుతుందని పండితులు చెబుతున్నారు. కొన్ని పనులను ఇంట్లో స్త్రీలు పెద్దవారు చెప్పినట్టుగా చేస్తే వారు సకల ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. అలా చెప్పిన కొన్ని విషయాలను గురించి ఇప్పుడు చర్చిద్దాం.

చీపురును మన పెద్దలు లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాంటి చీపురును ఇంట్లో ఆడవారు తన్నడం లేదా తొక్కడం చేస్తే లక్ష్మి దేవి ఇంట్లో నిలవదని చెబుతారు. అలాగే కడగకుండా ఉన్న వంట పాత్రలు, కడాయిల పొయ్యిపై ఎప్పుడూ పెట్టకూడదు. అలా పెట్టడం వలన కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అంటారు. కొంతమంది స్త్రీలు తలుపులను కాలితో తన్ని వేయడం, తీయడం చేస్తుంటారు. ఇలా చెయ్యకూడదు అని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఎప్పుడూ గుమ్మానికి ఎదురుగా కూర్చుని తినకూడదు. రాత్రిపూట తిన్న గిన్నెలు శుభ్రం చేసుకుని మాత్రమే పడుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి అశుభ్రంగా ఉన్న ఇంట్లో నిలవదని పెద్దలు చెబుతుంటారు.

అంతేకాకుండా ఇది అనారోగ్యం కూడా కలిగిస్తుంది. బొద్దింకలు వంటి కీలకాలు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. దానివలన డబ్బు ఖర్చు అవుతుంది. రాత్రి సమయంలో ఎప్పుడూ ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వంటివి చేయకూడదు. ఇలా చేసినా లక్ష్మీ దేవికి కోపం వస్తుందని చెబుతారు. అలాగే స్త్రీలు తెల్లవారిన తరువాత ఎక్కువసేపు పడుకోకూడదు. ఉదయం లేచిన వెంటనే వాకిలి తుడిచి, ముగ్గు వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు. 

ఇలాంటి ఆచారాలను మూఢనమ్మకాలను భావించకుండా ఒక క్రమశిక్షణగా ఇంటి పనులను నెరవేర్చుకోవడంతో పాటు ఇంటిల్లిపాది ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి పెద్దలు ఒక నమ్మకంగా మనలో చొప్పించారని నమ్మితే ఆనందంగా వీటిని పాటిస్తాం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతా ఐశ్వర్యంతో ఉన్నట్టే. అలాగే సమయానికి పనులు జరగడం కూడా మనం గమనిస్తాం.

Leave a Comment

error: Content is protected !!