indoor shaheen real story latest viral video

పేదింటి అమ్మాయి పై మనసు పడ్డ కోటీశ్వరుడు. ఆ అమ్మాయి కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇండోర్ సమీపంలోని జావ్రాలోని పఠంతోలిలో ఇరుకైన వీధిలో కవర్తో కప్పబడిన రెండు గదుల ఇంట్లో పెరిగిన షాహీన్ అనే అమ్మాయి హెలికాప్టర్‌లో కూర్చుని అత్తమామల ఇంటికి వెళ్ళింది. కూతురికి వీడ్కోలు ఇస్తూ.. పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించిన తల్లి, బట్టలు కుట్టె తండ్రి.  , ‘మా కూతురు నిజంగా అదృష్టవంతురాలు.  పెళ్లి చేసుకోవడానికి తనకోసం హెలికాప్టర్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని చెప్పారు. మెట్రిక్ పాస్ అయిన షాహిమా అడగకుండానే భగవంతుడు ఆనందాన్ని ఇచ్చాడు.

 వాస్తవానికి, షాహిద్ కుమార్తె షాహిన్కు మూడేళ్ల క్రితం రాజస్థాన్ కోటా జిల్లాలోని సుకేత్‌లో నివసించే మైనింగ్ వ్యాపారి ఆరిఫ్ ఖాన్ కుమారుడు హాజీ ఆసిఫ్ ఖాన్‌తో నిశ్చితార్థం జరిగింది. పెళ్ళి ముందురోజు ఆసిఫ్ హెలికాప్టర్లో పెళ్లికి నగరం నుండి వచ్చి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పెళ్లి అనంతరం వధువు షాహిన్తో కలిసి సుకేత్‌కు వెళ్లాడు.

 ఆసిఫ్ తల్లి మూడు సంవత్సరాల క్రితం షాహిన్ ఇంటి పక్కన ఉండే ఆసిఫ్ నానమ్మను కలవడానికి తన ఇంటికి వెళ్ళింది. అక్కడ నమాజ్ చేస్తున్న సాహిమాను చూసి ఇంత అందమైన అమ్మాయినీ, ఒద్దికగా ఉన్న అమ్మాయిని ఇంతకు ముందు ఎందుకు గమనించలేదు అని అనుకోని కొన్ని రోజులపాటు సాహిమాను గమనిస్తూ వుంది. ఆమె అందరితో ప్రేమగా మాట్లాడటం, రోజు నమాజ్ చేయడం చూసి ఆమెను తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది.

 అయితే ఆసిఫ్ సుకేత్‌కు చెందిన  ఖనిజ వ్యాపారి ఆరిఫ్ ఖాన్ కుమారుడు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సాహి మా ఇంటికి వచ్చి ఆమెను తన కొడుకు పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడారు. .

కానీ షాహిమా తల్లిదండ్రులు ఇంత ధనవంతులు తన కూతురిని ఎందుకు చేసుకుంటాను అంటున్నారు అని భయపడ్డారు. వారు తమ కూతురిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే తర్వాత ఆశిషఫ్ తల్లిదండ్రులు మాకు కావాల్సింది మంచి కోడలు మాత్రమే, ఆమెకు ఆస్తి ఉన్నా లేకపోయినా మాకు అనవసరం. మాకు మీ అమ్మాయిలోని మంచి గుణాలు నచ్చాయి. అందుకే మీ అమ్మాయిని మా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాం  అంటూ వారిని ఒప్పించారు.

 పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి వరుడు హెలికాప్టర్లో రావడం, తర్వాత వధువుని తీసుకుని హెలికాప్టర్లో వెళ్లిపోవడం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా చర్చనీయాంశం అయింది. అదృష్టం అంటే అదేకదా. ఒక్క రోజులో కటిక పేదరాలు  అయిన సాహిమా ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయింది. ఇప్పుడు ఆమెకు సేవ చేసేందుకు అనేక మంది పనివాళ్ళు ఉన్నారు భర్త, అత్తగారి కుటుంబం ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.

Leave a Comment

error: Content is protected !!