Instant Hands Whitening home remedies

ఎంత నల్లగా ఉన్న చేతులైనా సరే ఇలా చేస్తే తెల్లగా మారిపోతాయి.

కొంతమందికి ముఖం చాలా తెల్లగా మెరిసిపోతూ వుంటుంది. కానీ చేతులు నల్లగా మారిపోయి ఉంటాయి. దీనికి కారణం ముఖానికి ఎండవలన టాన్ పట్టేసి ఫేస్ ప్యాక్లతో మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ చేతులను అశ్రద్ధ చేస్తూ ఉంటాం. దీని వలన చేతులు నల్లగా మారిపోతాయి. మనం దీనికి ఒక చిట్కాతో మంచి మెరుపును అందించవచ్చు.

 దాని కోసం మనం ఒక గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకొని అందులో బాడీ స్క్రబ్ చేయడానికి ఉపయోగించే క్లాత్ స్క్రబ్బర్ ని తీసుకోవాలి. దీనిపై మనం బాడీని క్లీన్ చేయడానికి ఉపయోగించే బాడీ వాష్ కొంచెం వేసుకోవాలి. దీనిలో కొంచెం బేకింగ్ సోడా కూడా వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంతో బాగా స్క్రబ్ చెయ్యాలి. ఒక రెండు నిమిషాలు పాటు ఇలా స్క్రబ్ చేయడం వలన చేతులపై ఉండే మురికి, జిడ్డును తొలగించడానికి బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడతుంది. అలాగే స్క్రబ్ చేయడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

 తర్వాత మనం ప్యాక్ కోసం కొన్ని పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో మూడు స్పూన్ ల కాఫీ పొడి, రెండు స్పూన్ల పంచదార, ఒక స్పూన్ పసుపు, అర చెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చేతులకు అప్లై చేయాలి. దీనికోసం కొద్దిగా నీటిని చేర్చి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి. తరువాత నీటితో కడిగేయాలి. 

ఇందులో వాడిన పదార్థాలన్నీ చర్మాన్ని ఎక్స్పాలియేట్ చేయడానికి చాలా బాగా సహకరిస్తాయి. చర్మం పై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించి చర్మం మంచి రంగును సొంతం చేసుకునేలా సహకరిస్తుంది. ఎండ వలన వచ్చే టాన్ తొలగించడంలో ప్రముఖంగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండు స్టెప్స్ ను పాటిస్తూ నెలకు రెండు సార్లు చేతులను స్క్రబ్ చేయడం వలన చేతులను కూడా అందంగా  ముఖానికి మ్యాచ్ అయ్యేలా తయారు చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!