Instant Skin Whitening with 5 rupees

స్వీట్ షాప్ లో దొరికే ఐదు రూపాయల వస్తువుతో మీ స్కిన్ తెల్లగా మారుతుంది

ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్ లో ఉన్నప్పుడు అందంగా కనిపించాలని పార్లర్కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెడతారు. మీరు ఎంత జ్యువెలరీ వేసుకున్న ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ముఖంలో గ్లో లేకపోతే అవన్నీ వేస్ట్ అవుతాయి. మరింత అందంగా కనిపించడం కోసం గోల్డ్ ఫేషియల్ లేదా  సిల్వర్ ఫేషియల్ చేయించుకుంటే 8000 వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్న రెండు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ కేవలం స్వీట్ షాప్ లో దొరికే ఐదు రూపాయలుతో ఈ ఫేసియల్ చేసుకున్నట్లయితే నీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. 

       ఈ ప్యాక్ చేసుకోవడానికి ముందుగా ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా పెరుగు వేసుకోవాలి.  స్క్రబ్ కోసం  పుల్లటి పెరుగు కాకుండా తీయటి పెరుగును ఉపయోగించాలి. దానిలో ఒక చెంచా పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ  మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి. పెరుగుతో స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే మురికి జిడ్డు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రిమూవ్ అవుతాయి. మీ ముఖం స్మూత్ గా అవుతుంది. ముఖంపై ఉంటే టాన్  మొత్తం పోతుంది. 

      ముఖం పై ఉండే టాన్  పోయినట్లయితేనే ఫేషియల్ యొక్క ఫలితం బాగుంటుంది. తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగి కడుక్కొని ముఖానికి అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి. తర్వాత స్వీట్ షాప్ లో దొరికే గోల్డ్ పేపర్ లేదా  సిల్వర్ పేపర్ ను తెచ్చుకొని ఈ పేపర్ ను ముఖంపై మొత్తం పట్టుకునే లాగా అంటించుకోవాలి. తర్వాత చేతిలో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ముఖాన్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది 

        మీ ముఖం తెల్లగా  మెరిసిపోవాలంటే సిల్వర్ పేపర్ ను ఉపయోగించాలి. గోల్డెన్ గ్లో కావాలి అనుకుంటే గోల్డ్ కలర్ పేపర్ ను ఉపయోగించుకోవాలి. పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి చేయించుకునే  గోల్డ్ ఫేషియల్ లేదా సిల్వర్ ఫేషియల్ కూడా గ్లో రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఐదు రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకున్నట్లయితే గోల్డ్ ఫేషియల్ కంటే మీ ఫేస్ ఇంకా  కాంతివంతంగా మెరిసిపోతుంది. ఏదైనా ఫంక్షన్ కి లేదా  పార్టీకి వెళ్లడానికి ముందు రోజు ఈ ఫేషియల్ ను ట్రై చేసినట్లయితే ముఖం అందంగా కనిపిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!