interesting facts about cooking refined oils

వంటనూనెల్లో విస్మయపరిచే నిజాలు…..

నూనె లేని వంట ఎక్కడా కనిపించడం లేదు. ఇక బయట  స్ట్రీట్ ఫుడ్స్ గూర్చి చెప్పనవసరం లేదు. నీళ్లలో ముంచి తీసిన పండ్లలా ఈదుతున్న తినుబండారాలు అన్ని యమా రుచిగా వుంటూ ఇంకా ఇంకా తినేలా చేస్తాయి.  అయితే బయట విషయాన్ని వదిలితే ఇంట్లో కూడా నూనెలు వాడకం ఎక్కువైపోయింది. ఒకప్పుడు కిలో నూనె నెల రోజులు వాడేవాళ్ళు. ఇప్పుడైతే దాదాపు అయిదు కిలోలు ఈసీ గా అయిపోతోంది. ఇక మనము వాడుతున్న నూనెలు బ్రాండ్లు గూర్చి చెప్పుకుంటే 90% మంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటారు. దానికి కారణం కూడా డాక్టర్లు రికమెండ్ చేయడం అంటారు. రిఫైండ్ చేసిన ఆయిల్స్ ఇంత విరివిగా వాడటం సమంజసమేనా?? అసలు ఏ నూనెలు వంటకు మంచిది?? ఏ నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయ్?? డాక్టర్లు చెప్పే రిఫైండ్ ఆయిల్ లో నిజానిజాలు ఏంటి?? ఒకసారి చూడండి.

◆మనం వాడే వంట నూనెలో అసంతృప్త కొవ్వులు, సంతృప్త కొవ్వులు అని రెండు రకాలు ఉంటాయి.  మన శరీర ఆరోగ్యానికి అసంతృప్త కొవ్వులు కలిగిన నూనెలు వంటలో వాడటం ఉత్తమం. అయితే ఈ అసంతృప్త కొవ్వులు మనం రోజువారి వాడుతున్న నూనెలో ఉన్నాయా?? అని ప్రశ్నించుకుంటే మనకు వాడటం, డాక్టర్లు, టీవీ యాడ్స్ లో రికమెండ్ చేయడం ఇవి తప్ప వాటిలో నిజానిజాలు తెలియదు. 

◆సాధారణంగా వాడే వంట నూనెలో వేరుశనగ, సన్ఫ్లవర్ ఆయిల్, అరుదుగా నువ్వుల నూనె, కాస్త అర్గిక స్థితి బాగున్న వారు అయితే ఆలివ్ ఆయిల్ వంటివి వాడుతారు. అయితే 90% మంది వాడుతున్నది మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్. 

◆చాలా మంది డాక్టర్లు పేషెంట్ లకు రిఫైండ్ ఆయిల్ వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే ఈ రిఫైండ్ ఆయిల్ ను వాడటం ఎంత వరకు శ్రేయస్కరం అనేది పేషెంట్ లు తెలుసుకోకుండా వాడేస్తుంటారు.

◆మన శరీరంలో 70% వాతరోగాలు సంభవిస్తున్నది ఈ రిఫైండ్ ఆయిల్స్ వల్ల అంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. రిఫైండ్ చేసిన నూనెలు ద్వారా ప్రకోపించింన వాతాన్ని అరికట్టి శరీరాన్ని సమతుల్యంలో ఉంచగలిగేవి గానుగ ద్వారా తీసిన నూనెలు మాత్రమే. మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పి, హార్ట్ అటాక్ వంటి సమస్యలు వస్తున్నది రిఫైండ్ ఆయిల్ ను వాడటం వల్లనే.

◆నూనె గింజలను ఎంత ఎక్కువ ప్రాసెస్ చేస్తే అంత సహజ గుణాన్ని కోల్పోతాయి. అంటే గింజల నుండి సహజంగా లభ్యం కావాల్సిన  మంచి కొవ్వులు విచ్చిన్నమైపోతాయై. 

◆రిఫైండ్ నూనెలను దాదాపు 230℃ ఉష్ణోగ్రతను ఉపయోగించి శుద్దిచేస్తారు. దీనివల్ల నూనెలోని కార్బన్ అణువులు అమరిక మారిపోయి నూనెలో సహజమైన మంచి కొవ్వులు విచ్చిన్నమైపోయి అవి శరీరానికి హాని కలిగించే చెడు కొవ్వులుగా రూపాంతరం చెందుతాయి. ఇవి రక్తం లో కలిసిపోయి రక్తనాళాలలో ఇరుక్కుపోయి, రక్తనాళాల వ్యవస్థను దెబ్బ తీస్తూ గుండెకు సరఫరా చేసే రక్త వ్యవస్థను ఆటంకపరుస్తూ గుండె జబ్బులకు కారణమవుతాయి.

◆రిఫైండ్ కాబడిన నూనెలోని ఫెక్టిన్ అనే రసాయనం శరీరంలో చేరడం వల్ల చర్మవ్యాధులకు దారి తీస్తుంది. ఇది మనిషి మానసిక వ్యవస్థను ప్రభావితం చేసే హార్మోన్లను విధుడల చేసి అసందర్పపు డిప్రెషన్ కు కారణం అవుతాయి.

◆మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే నూనెలు శుద్ధి చేయడంలో అంతే నూనె స్వభావం తక్కువగా పలుచన చేయడానికి  పాస్పోలిఫిడ్స్ ను వేరు చేయడానికి జంతువులు మరియు ఫంగస్ నుండి సేకరించిన ఎంజైములను వాడతారు. అందువల్లనే రిఫైండ్ నూనెలు కంటికి ఇంపుగా స్వచ్ఛంగా కనబడతాయి.

◆గానుగ ద్వారా ఆడించిన నూనెలో ఇలాంటి ప్రాసెస్ ఉండదు. స్వతహాగా ఉన్న మంచి కొవ్వులు విచ్చిన్నం అవ్వవు. అందుకే అవి ధర ఎక్కువగా ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటాయి.

చివరగా…..

ఇన్ని చెప్పుకున్నాక వంట కోసం ఏ నూనె మంచిది అనే విషయం వేరుగా చెప్పాలా ఏంటి. ఫైనల్ నిర్ణయం మాత్రం మీదేగా…..

Leave a Comment

error: Content is protected !!