interesting facts in telugu viral video

ఏడాది పాపని ఇంట్లో వదిలి వెళ్లారు 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఏం జరిగిందంటే షాకింగ్

 అమ్మంటే తన బిడ్డలను  ప్రతి నిమిషం  చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాంటిది ఈ తల్లి తన బిడ్డని సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు ఒక పాడుబడ్డ  ఇంటిలో వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా  ఏదో సినిమా   కథ అనుకుంటున్నారా! కాదు యదార్థంగా జరిగిన సంఘటన.  ఇది రష్యా యారోస్లావ్ లో  జరిగింది. ఒక తల్లి తన బిడ్డను సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఎవరు లేని ఇంట్లో ఒంటరిగా వదిలి తాళం వేసుకొని వెళ్లిపోయింది.

అటుగా వెళ్తున్న వ్యక్తి పాప ఏడుపు  ఇంటి చుట్టు చూడగా ఎవరు కనిపించకపోయేసరికి నిర్మానుష్య ప్రదేశంలో చిన్న పాప ఎందుకు ఉంటుంది అందుకని వెళ్లిపోయాడు. కానీ అతను  అటువైపు వెళ్ళిన ప్రతి సారి పాప  ఏడుపు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి  ఇంటి లోపల మొత్తం  వెతకగా  పాతదుప్పటిలో చుట్టుకొని  స్పృహతప్పి పడి ఉంది. చలికి తట్టుకోలేక పాప దుప్పటి చుట్టుకొని ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయింది. అప్పటికే ఆరు రోజుల నుంచి ఆహారం లేదు.

పోలీసులు పాపను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి డాక్టర్లు వైద్యం చేయమని కొద్ది రోజులపాటు అక్కడే ఉంచమని చెప్పారు. డాక్టర్లు సైతం తను  6 రోజులనుంచి పాప ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా ప్రాణాలతో ఉండటం  చూసి ఆశ్చర్యపోయారు. ఆ పాప పేరు  లీసా.  పాప హాస్పిటల్ లో ఉండగా ఏడు సంవత్సరాల బాబుని తీసుకుని అతని తల్లి ఈనా వైద్యం కోసం వచ్చేది. అక్కడే నర్స్  ద్వారా లీసా  గురించి తెలుసుకొని ప్రతిరోజు పాపకు బట్టలు కావలసిన ఆహారం వంటివి తెచ్చి ఇస్తూ ఉండేది.

కొద్ది రోజులు  తర్వాత ఈనా వచ్చి చూసేసరికి  పాప అక్కడ ఉండదు. అప్పుడు నర్స్ని  అడగగా  పాప డిశ్చార్జ్ అయి అనాధాశ్రమంలో జాయిన్ చేయడానికి పోలీసులు తీసుకెళ్లారు అని చెప్తుంది. ఈనా  అప్పటికే పాపకు చాలా దగ్గర అవ్వడం వలన అనాధాశ్రమానికెళ్ళి పాపను దత్తత తీసుకుంటుంది. లీసాని కూడా తన కొడుకుతో పాటు సమానంగా పెంచుతుంది. కానీ లీసా చిన్నప్పుడు జరిగిన  సంఘటన వలన చాలా ఇబ్బందిగా నడుస్తుంది. అది గమనించిన ఈనా డాన్స్ నేర్పిస్తుంది ఈనా  ఊహించినట్లుగానే లీసా  డాన్స్ నేర్చుకుని దాంతో తనలో  ధైర్యం నింపుకొని నడక ప్రారంభిస్తుంది.

కానీ అందరితో సమానంగా కలవలేక పోతుంది. అది చూసి పిల్లలు అందరూ ఏడిపించడం మొదలు పెడతారు. కానీ ఈనా ఎప్పుడు లీసాని  సపోర్ట్ చేస్తూ చాలా ప్రేమగా నచ్చచెప్తూ ఉండేది. లీసా  టీనేజ్ వయసు వచ్చేసరికి మోడల్గా చాలా  అవార్డులను, మెడల్స్ను సంపాదించుకుంది. అంత పేరుప్రఖ్యాతులు గాంచిన లీసా గురించి వదిలేసిన  తన తల్లికి తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమీ అవలేదు. తెలుసుకొని లీసాని కలవడానికి వచ్చిన తల్లిని తను చిన్నప్పుడే చనిపోవాలని వదిలేసిన తల్లిని చూడటానికి కూడా ఇష్టపడలేదు.

Leave a Comment

error: Content is protected !!