పువ్వులు పూజకు అలంకరణకు వాడతాం కానీ కొన్ని దేశాల వైద్య విధానాల్లో ముఖ్యంగా ప్రాచీన వైద్యంలో పువ్వులను నీటిలో కాచి గ్రీ టీ లాగా, ఆ పువ్వుల పేర్లతో టీ తయారుచేసుకుని తీసుకునేవారు. అలాంటి కోవలోదే చేమంతి పూల టీ. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ చేమంతి పూల టీ లో ఫ్లేవనాయిడ్లు అనే రసాయనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో తలెత్తే ఆరోగ్య సమస్యలను ఎన్నో ఆరోగ్య సమస్యలను సులువుగా తగ్గిస్తాయి. చేమంతి పూల టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూడండి మరి.
నెలసరి నొప్పిని తగ్గిస్తుంది.
మహిళలకు సాధారణం అయిన నెలసరి సమయంలో ఎదురయ్యే తిమ్మిరి మరియు కఫుపునొప్పిని చేమంతి పూల టీ తగ్గిస్తుంది. ఒక నెలపాటు విడవకుండా ఈ టీ తీసుకోవడం వల్ల గతంలో ఎదురైనట్టు తిమ్మిర్లు, కడుపునొప్పి కండరాలు పట్టేసినట్టు ఉండడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి వారు చేమంతుల టీ తీసుకోవడం వల్ల అధికంగా ఉన్న చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గిస్తుంది. అంతే కఫు డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది కూడా.కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ టీ ని భాగం చేసుకోవడం మరియు డయాబెటిస్ లేనివారు అపుడపుడు ఈ టీ ని తీసుకోవడం ఉత్తమం.
బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది
బోలు ఎముకల వ్యాధి ఎముక సాంద్రత తగ్గడం వల్ల ఏర్పడుతుంది. ఇది విరిగిన ఎముకలు మరియు వంగి ఉన్న ఎముకలకు మరింత ప్రమాదాన్ని పెంచుతుంది. రుతుక్రమం ఆగిన మహిళల్లో ( అంటే మెనోపాజ్ దాటిన వారిలో) ఇది చాలా సాధారణం. ఇది ఈస్ట్రోజెన్ ప్రభావం వల్ల ఏర్పడచ్చు. చేమంతి పూల టీ తీసుకోవడం ద్వారా ఈస్ట్రోజోన్ హార్మోన్ ను సమతాస్థితిలో ఉంచగలుగుతుంది తద్వారా బోలు ఎముకల వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
మంట తగ్గిస్తుంది
యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు అనేది ఇన్ఫెక్షన్తో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ ఏర్పరుచుకున్న చర్య . చెంన్తీ పూల టీ లో ఈ యాంటీ ఇన్ప్లమేషన్ లక్షణాలు ఉన్నాయి ఇవి మంటను తగ్గిస్తాయి.
యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుంది.
చేమంతి పూల టీ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని విచ్చిన్నం చేస్తుంది. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారు ఈ చేమంతి పూల టీ ని రోజూ తీసుకోవడం వల్ల ముఞ్చి ఫలితం ఉంటుంది, తొందరగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
మంచి నిద్రకు దోహాధం చేస్తుంది.
ఈ టీని తీసుకోవడం వల్ల అలసట, చిరాకు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తగ్గి శరీరంలో అంతర్గత అవయవాలకు ఉపశమనాన్ని చేకూర్చి విశ్రాంతిని కలిగిస్తుంది. నిద్రలేమి సమస్య మరియు కలత నిద్ర వంటి వాటితో బాధపడేవారు చేమంతి పూల టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రశాంతమైన నిద్ర పొందగలుగుతారు.
జలుబు తగ్గిస్తుంది.
చేమంతి పూలను ఎక్కువమొత్తం నీటిలో వేసి బాగా మరిగించి అ నీటి ద్వారా వెలువడే ఆవిరిని పీల్చడం వల్ల జలుబు తొందరగా తగ్గుతుంది. అంతే కాదు గొంతు మరియు శ్వాస సంబంధిత సమస్యలు మెల్లిగా తగ్గుతాయి.
చర్మసంరక్షణ కు తోడ్పడుతుంది.
చేమంతి పూల రసాన్ని లేదా టీ ని నేరుగా గాయం మీద వేయడం వల్ల గాయం తొందశరగా మానడం జరుగుతుంది. అలాగే చర్మ సంబంధ వ్యాధులైన తామర, దురద, అలర్జీ వంటి వాటిని నయం చేయడంలో కూడా దోహాధం చేస్తుంది.
చివరగా……
చేమంతి పూల టీని పాశ్చాత్య దేశాల్లో విరివిగా ఉపయోగిస్తారు. పిన్ అవహేపీలుకున్న ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే మాత్రం తప్పకుండా మీరు కూడా తీసుకోవడం మొదలుపెట్టండి.