Intermittent fasting May Have Health Benefits Beyond Immunity

వారానికి ఒకసారి పాచిముఖంతో ఉంటే కలిగే లాభాలేంటి.ఎవరికీ తెలియని. టాప్ సీక్రెట్

మనం రోజుకి మూడు లేదా నాలుగు సార్లు అంతకంటే ఎక్కువగా కూడా తింటూ ఉంటాం. ఇలా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్య వస్తూ ఉంటుంది. అలాగే వెంట వెంటనే ఆహారం తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించదు. దానివలన శరీర వ్యవస్థ గాడి తప్పుతోంది మరియు తిన్న ఆహారం జీర్ణం అవ్వక ముందే మళ్ళీ ఆహారం తినడం వలన అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు కూడా ఏర్పడతాయి.

 వీటిని తగ్గించుకోవడానికి మనం రకరకాల మందులు వేసుకుంటూ ఉంటాం. వీటి వలన కాలక్రమంలో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారంలో కనీసం ఒకరోజు ఒక్క పూట భోజనం మాత్రమే తీసుకోవడం వలన శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటు మొత్తం వ్యవస్థ తనను తాను రిపేర్ చేసుకుంటుంది మరియు శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలను కరిగించి ఉపయోగించుకుంటుంది. దీని వలన అధిక బరువు సమస్య తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

 ఈ ఒక్క పూట భోజనం అనేది ఎలా ఉండాలో తెలుసుకుందాం. వీలైన వారు ఉదయాన్నే కొద్దిగా మొలకలు, పండ్లు తీసుకుని మధ్యాహ్నం మనకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు. సాయంత్రం కూడా కేవలం పండ్లు ముక్కలతో ఉండడం వలన త్వరగా బరువు తగ్గి అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా మధ్యాహ్నం వరకు ఉండలేని వారు మరో చిట్కా ఫాలో అవ్వొచ్చు. చాలామందికి బ్రష్ చేసిన వెంటనే ఆకలి వేయడం మొదలు పెడుతుంది. అందుకే వీలైనంత లేటుగా బ్రష్ చేయడం వలన అప్పటివరకు ఆహారం తినకుండా ఉండవచ్చు. 

కావాలనుకుంటే మధ్యలో కొద్దిగా నీటిని తాగుతూ బ్రేక్ ఇవ్వచ్చు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు సమయంలో నచ్చిన ఆహారం కడుపు నిండా తినవచ్చు. మళ్ళీ సాయంత్రం ఎటువంటి ఆహారం తీసుకోకూడదు గనుక ఇప్పుడు పూర్తిగా ఆహారం తీసుకోవడం మంచిది. మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా వారంలో కనీసం ఒకరోజు వీలైన వారు రెండు రోజులు చేయడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. దీనినే ఇంటర్మీటెన్ ఫాస్టింగ్ అంటున్నారు.

Leave a Comment

error: Content is protected !!