iron increasing foods

మీ ఒంట్లో రక్తాన్ని తయారుచేసే వీటిని తింటేచాలు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు iron increasing foods

రక్తహీనత ఇప్పుడు చాలామందిలో కనిపిస్తున్న సమస్య. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడంవలన ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది.దీంతో రక్తం స్థానంలో నీరు చేరుతుంది. దానివలన ఒళ్ళు పొంగినట్టు అయ్యి బరువుగా ఉండడం, చిన్న చిన్న పనులకు అలసిపోవడం, జుట్టు రాలిపోవడం, కాళ్ళలో తిమ్మిర్లు, కళ్ళు తిరగడం,ముడతలు రావడంలాంటి సమస్యలు ఎక్కవవుతాయి. అలాగే శరీరంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 , విటమిన్ సి లోపంవలన కూడా రక్తహీనత సమస్య కు కారణమవుతుంది. శరీరానికి సరిపడా ఐరన్ అందితే రక్తహీనత సమస్య తగ్గి ఎనీమియా సమస్య ను దూరంచేసుకోవచ్చు.  మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

రక్తహీనతను తగ్గించడంలో మాంసాహారం బాగా పనిచేస్తుంది. మటన్ లివర్,చికెన్ లివర్ తినడంవలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. మాంసంలో కొవ్వు పదార్థాలు అధికం కనుక వారంలో కేవలం రెండు సార్లు తీసుకోవడం మంచిది. అలాగే చేపలు రొయ్యలు లాంటివి కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. రక్తహీనతకు పండ్లుకూడా మంచి ఆహారం. సిట్రస్ పండ్లు అంటే నారింజా, నిమ్మ, మామిడిలాంటి పండ్లు తినడం వలన ఐరన్‌తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్ సి కూడా లభిస్తుంది. రోజూ ఒకగుడ్డు తినడం వలన కూడా రక్తహీనతను అధిగమించవచ్చు. డ్రైప్రూట్స్ కూడా ఐరన్ పుష్కలంగా  ఉంటుంది. ముఖ్యంగా ఆప్రికాట్లో విటమిన్ ఏ,సి,ఇ,  బీటాకెరొటిన్, పొటాషియం దొరుకుతాయి. 

అంజీర్‌లో కూడా నాచురల్ షుగర్‌తో పాటు  మినరల్స్, సోల్యుబుల్ ఫైబర్, పొటాషియం,  యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ అండ్ కే అధికంగా ఉండి శరీరంలో ఐరన్ కంటెంట్ పెంచుతాయి. ప్రతిరోజూ రెండు ఎండు అంజీరాలను నానబెట్టి తినడంవలన రక్తహీనత ను అధిగమించాలి. అలాగే పల్లీలలో కూడా ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది. అయితే పల్లీలను నేరుగా కాకుండా పీనట్ బటర్లా తీసుకుంటే మంచిది. దీనివలన ఐరన్ శాతం ఎక్కువ. కివీ పండ్లు ,సారపప్పులో కూడా ఐరన్ అధికంగా ఉండి రక్తహీనత లోపాన్ని తగ్గిస్తుంది. 

జీడిపప్పు కూడా ఐరన్‌తో నిండిఉంటుంది. ప్రతిరోజూ జీడిపప్పు కొద్ది మొత్తంలో తీసుకోవడం వలన పదిగ్రాముల జీడిపప్పు లో మూడు గ్రాముల ఐరన్ ను అందిస్తుంది. బాదం తినడంవలన కూడా రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఎండుద్రాక్ష కూడా రోజు నానబెట్టి తినడంవలన విటమిన్ బి కాంప్లెక్స్ అంది రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి సరిపడా ఐరన్ లభించి రక్తహీనత సమస్య తగ్గితే ముఖం కాంతివంతంగా తయారవడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. రక్తహీనత సమస్య తో బాధపడేవారు, లక్షణాలు కనిపించే వారు సహజ పద్ధతిలో రక్తహీనత సమస్యను అధిగమించి  ఆరోగ్యం గా ఉండొచ్చు.

Leave a Comment

error: Content is protected !!