పుట్నాలపప్పు దీన్నే వేపుడు శనగపప్పు అని కూడా అంటారు. పూర్వం రోజుల్లో కాలక్షేపానికి వీటిని తినేవారు. కానీ ఈ రోజుల్లో వేపుడు శనగపప్పు గ్యాస్ వస్తుందని, పొట్ట ఉబ్బుతుంది అని తినడం మానేస్తున్నారు. మరి ఈ వేపుడు శనగపప్పు సామాన్యునికి బలమైన ఆహారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ నిచ్చే ఆహారం. చాలా మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఆహారం. 100 గ్రాముల పుట్నాల పప్పు తీసుకుంటే 369 క్యాలరీలు శక్తి వస్తాయి. 100 గ్రాముల చాపలు తీసుకుంటే 80-90 క్యాలరీల శక్తి వస్తుంది. అంటే ఈ పుట్నాల పప్పు తినడం వల్ల 5 టైమ్స్ బలం ఎక్కువ. అలాగే కోడి మాంసం తీసుకుంటే 109 క్యాలరీల శక్తి వస్తుంది.
మేక మాంసంలో తీసుకుంటే 116 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. కానీ ఈ పుట్నాల పప్పు చికెన్, మటన్ తో పోల్చుకుంటే చాలా రేటు తక్కువ. అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారము, అందుకని ఇది చాలా మంచిది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ప్రోటీన్ 100 గ్రాముల పుట్నాల పప్పులో 25 గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది. చేపల్లో ప్రోటీన్ వచ్చేసి 10-18 గ్రాములు, మటన్ లో తీసుకుంటే 21 గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది. మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ దీని నుంచి లభిస్తుంది. మటన్ కన్నా పది రెట్లు రేటు తక్కువ 10 రెట్లు తక్కువ. మటన్ కంటే మూడు రెట్లు బలం ఎక్కువ. దీనిలో కొవ్వు ఐదు గ్రాములు ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ 57 గ్రాములు ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీనిని తీసుకోవచ్చు. ఇది షుగర్ ని పెంచదు. ఇది స్పెషల్ గా డయాబెటిక్ పేషంట్లకి కూడా చాలా మంచిది. కాబట్టి ఈవినింగ్ టైంలో దీనిని తీసుకుంటే చాలా మంచిది. ఈ పప్పుతో ఎండు ఖర్జూరం లేదా ఆర్గానిక్ బెల్లంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని డిన్నర్ లో తింటే చాలా మంచిది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లదాకా దీనిని తినొచ్చు. ఇందులో అతి ముఖ్యంగా ఐరన్ కంటెంట్ 10 గ్రాముల ఐరన్ దీనిలో ఉంటుంది. అందుకని గర్భవతులకు ఇది చాలా మంచిది.
ఈ పుట్నాల పప్పు తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్ గా చాలా మంచిదని సైంటిఫిక్ గా ఉంది. అంటే ప్రేగుల్లో బ్యాక్టీరియా బాగా పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో బలంతోపాటు రక్తం తయారవ్వడానికి ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా లభిస్తుంది.