మన శరీరానికి ఐరన్ అనేది 25 మిల్లీ గ్రాములు కావాలి. 100 గ్రాముల కాలీఫ్లవర్ కాడలు తీసుకుంటే 40 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ ఈ క్యాలీఫ్లవర్ కాడలనీ అందరూ పడేస్తూ ఉంటారు. పువ్వులు కోసుకుని కాడలను అందరూ పడేస్తూ ఉంటారు. ఈ పడేసే కాడల లోనే రహస్యమంతా ఉంది. కాబట్టి ఇకనుంచి ఈ కాలీఫ్లవర్ కాడలను పాడేయకుండా కూర చేసుకుని తింటే చాలా ఐరన్ దొరుకుతుంది. ఇక ఐరన్ టాబ్లెట్స్ కి స్వస్తి పలకవచ్చు. అలాంటి క్యాలీఫ్లవర్ కాడల కూర హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కాలిఫ్లవర్ కాడ ముక్కలు ఒక కప్పు, పుల్ల మజ్జిగ ఒక కప్పు తీసుకోవాలి.
ఇంకా కొబ్బరి తురుము అరకప్పు, పచ్చిమిర్చి నాలుగు, నిమ్మరసం అర టీ స్పూన్, మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్, శనగపప్పు వన్ టేబుల్ స్పూన్, జీలకర్ర వన్ టీ స్పూన్, ఆవాలు వన్ టీ స్పూన్, మీగడ వన్ టీ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ముందుగా కాలీఫ్లవర్ కాడలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిని పుల్లని పెరుగులో వేసి ఉడికించాలి. ఇలా చేస్తే చప్పదనం పోయి ముక్కలు కమ్మగా, రుచిగా ఉంటాయి. ఉడికిన తర్వాత జల్లెడ లో పోసి నీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద నాన్ స్టిక్ పాత్ర తీసుకుని దానిలో కొద్దిగా మీగడ వేసి ఫ్రైకి తాలింపు పెట్టుకోవాలి.
దానికి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, వేసి పచ్చిమిర్చి ముక్కలను, కొద్దిగా పసుపును వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడకపెట్టిన కాలీఫ్లవర్ కాడ ముక్కలని తీసుకుని వెయ్యాలి. తరువాత వీటిని బాగా కలుపుకొని 7, 8 నిమిషాలపాటు బాగా వేగనివ్వాలి. ఇలా చేస్తే ఆ కాడలలో ఉండే నీటి శాతం తగ్గి పొడిపొడి లాడుతూ కమ్మగా తయారవుతుంది. దీనిపైన నిమ్మరసం వేసి తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ కాలీఫ్లవర్ కాడల ఫ్రై కి మరొక పేరు ఐరన్ ఫ్రై అని కూడా అంటారు. ఈ కాలీఫ్లవర్ కాడల్ని పాడైయకుండా ఇలా వండుకుని తింటే చాలా మంచిది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి.
ప్రతి ఇంట్లో దీనిని వండుకుని తింటే రక్తహీనత రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు.