ఆకుకూరలు, కూరగాయలు కంటే మూడు అంతులు లాభం కలిగి ఉంటాయని మనందరికీ తెలుసు. సూక్ష్మ పోషకాలు కూరగాయల్లో కంటే ఆకుకూరల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆకులలో చుక్కకూర రెండు మూడు రకాల లాభాలను మనకు అందించింది. అలాంటి చుక్కకూరలోని ఎక్స్ట్రాక్ట్స్, పాలీ ఫినాల్స్ హార్ట్ లో బ్లాక్స్ రాకుండా స్పెషల్గా రక్షిస్తుంది అని ఎలుకలపై పరిశోధన చేసి 2020 వ సంవత్సరంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా వారు స్పెషల్ గా నిరూపించడం జరిగింది. మామూలుగా ప్లేట్లెట్స్ అనేవి ఒకదానికొకటి కలిసిపోయి రక్తనాళాల్లో బ్లాక్స్ లాగా అడ్డుకుంటాయి. రక్తనాళాల్లో ఆటంకాలు కొలెస్ట్రాల్ వల్లే కాకుండా ప్లేట్లెట్స్ వల్ల కూడా జరుగుతుంది.
ఈ హార్ట్ బ్లాక్ ముఖ్యంగా ప్లేట్లెట్స్ వల్ల రాకుండా ఉండడానికి పోలి ఫినాన్స్ చుక్కకూరలో ఉన్నాయి కాబట్టి బాగా ఉపయోగపడతాయి. హై బీపీ ఉన్నవారికి తగ్గడానికి లేనివారికి రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో ఉండే ఎండో తీలియం సెల్ సిగ్నల్స్ మార్చి నైట్రిక్ ఆక్సైడ్ సెల్ బాగా పెరిగేటట్టు చేసి స్మూత్ గా చేస్తుంది. చుక్కకూర తినడం వల్ల బిపి కంట్రోల్ అవుతుంది. దీనిని 2017 సంవత్సరంలో చైనా వారు ఈ బీపీ గురించి పరిశోధన చేసి నిరూపించారు. ఇక మూడవది బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించడానికి రాకుండా చేయడానికి చుక్కకూర అనేది బాగా ఉపయోగపడుతుంది.
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ సెల్స్ ని చంపడానికి ఈ చుక్కకూర బాగా ఉపయోగపడుతుందని 2012 సంవత్సరంలో హంగేరియ దేశం వారు నిరూపించారు. ఈ చుక్క కూరను పప్పులో వేసుకుని వండుకోవచ్చు. వేరే ఆకుకూరతో కలుపుకొని కూడా తినవచ్చు. వారానికి మూడుసార్లు ఈ చుక్కకూరను ఆహారంగా తీసుకోవాలి. 100 గ్రాముల చుక్కకూర తీసుకుంటే దానిలో 90 గ్రామ్స్ నీరు మాత్రమే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 3 గ్రామ్స్, ప్రోటీన్ 1.6 గ్రామ్స్, ఫాట్ 1.2 గ్రామ్స్. ఇందులో సూక్ష్మ పోషకాలు తీసుకుంటే విటమిన్ C 53 mlg, విటమిన్ K 126 mic.grm, లుట్టిన్ 2370 mic.grm, 2754 mic.grm, ఐరన్ 4 mlg, మెగ్నీషియం 48 mlg.
ఇలాంటి సూక్ష్మ పోషకాలు చుక్కకూరలో ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి ఫలితాలు మనం పొందవచ్చు. ఈ చుక్కకూరను వాడడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది.