మహిళలకు ఉన్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది నెలసరి తో మొదలై క్రమంగా పెరుగుతూ ఇతర సమస్యలను కూడా వెంట తీసుకొస్తుంది. ఒకప్పుడు మహిళలలో నెలసరి సమస్యలు ఎక్కువ ఉండేవి కావు. కానీ ఇప్పుడు వయస్సులో ఉన్న వాళ్లలో 80 శాతం పైగా నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమంది గైనకాలజిస్ట్ లను కలిసినా, ఎన్ని మందులు వాడినా అవి వాడినన్ని రోజులు బాగానే ఉంటుంది కానీ తరువాత మళ్ళీ కథ మొదటికి వస్తుంది. కారణం అంటే, హర్మోనుల లోపం అంటున్నారు. శరీరంలో ఎండోక్రైన్ అనే గ్రంథులు హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రంథులు ఒక ఫ్యాక్టరీ లాంటివి. శరీరంలో తగిన హార్మోనులు ఉత్పత్తి కావడానికి అవసరమైన ఆహారం తీసుకోకుండా కేవలం వైద్యులు రాసిచ్చిన మందులు వాడి అవి సెట్ అయిపోవాలి అంటే ఎలా చెప్పండి.
ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం?? ఏ ఆహారం తీసుకుంటే శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించడ్సమ్ కానీ కనీసం తెలుసుకోవడం కానీ ఎవరూ చేయరు. సమస్య మీదకొచ్చినపుడే పరిష్కారం కోసం తాపత్రయం కానీ ముందుజాగ్రత్త ఎవరూ పాటించకపోవడం వల్లే మహిళల్లో ఇన్ని సమస్యలు. మంచి ఆహారం తింటే 3, 4 నెలల్లోపే అందరికీ నెలసరి సమస్యలు తీరి రెగ్యులర్ అయిపోతాయి.
మంచి ఆహారం ఏది?? అనే సందేహం అందరికి రావచ్చు. శుభ్రంగా వండేది మంచి ఆహారం అని కొందరి అభిప్రాయం. నోటికి రుచిగా ఉండేది మంచి ఆహారమని మరికొందరి అభిప్రాయం. కానీ హార్మోన్లను ఎక్ఖవ తక్కువలుగా ఉత్పత్తి చేయకుండా ఆరోగ్యాన్ని చేకూర్చే అసలైన ఆహారం ఏమిటో చదివేయండి మరి.
ఎంత వండని ఆహారం తింటే అంత త్వరగా సమస్య తగ్గుతుంది. ఉదయం పూత తీసుకునే ఇడ్లి, దోస, ఉప్మా లాంటి టిఫిన్లు తీసికోవడం మనేయాలి. ప్రతిరోజూ ఉదయాన్నే కూరగాయలతో జ్యూస్ తయారు చేసుకుని తాగడం మొదలుపెట్టాలి. అలా కూరగాయల జ్యుస్ తాగినా తరువాత గంటసేపటికి పెసలు, శనగలు వంటి నాలుగైదు రకాల మొలకెత్తిన గింజలను తినాలి. వీటిని బాగా మెల్లిగా పూర్తిగా నమిలి మింగలి. ఈ గింజలకే హార్మోనుల ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. అంటే మొలకెత్తిన గింజల్లో హార్మోన్లను ఉత్పత్తి చేయగల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
సాయంకాలం 4, 5 గంటలకు ఒక గ్లాసుడు పండ్ల రసం (బత్తాయి, నారింజ, దానిమ్మ) త్రాగి, 40, 50 నిమిషాల తరువాత పొట్ట నిండా పండ్లను తినాలి. ఆ తరువాత రాత్రికి బోజనమ్ చేయకూడదు. ఆ పండ్లనే భోజనం గా సరిపెట్టుకుని ఇక ఉడికినవి ఏమీ తినకుండా ఆపాలి. అయితే మధ్యాహ్నం మన పద్ధతిలో ఉడికించిన వాటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
చివరగా…
హార్మోన్ల సమస్యకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది కానీ శాశ్వత పరిష్కారం శూన్యం. కాబట్టి పైన చెప్పుకున్న ఆహారం తీసుకుంటే మహిళల అన్ని సమస్యలు మంత్రించినట్టు మాయం అయిపోతాయి.