Is coconut cream bad for your heart

ఇది వంటల్లో ఒక స్పూన్ వాడితే చాలు……. అంతులేని శక్తి మీ అందరికీ లభిస్తుంది……

ప్రస్తుత కాలంలో మనందరం టెక్నాలజీ మారీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటూ వస్తున్నారు. ఈ కాలంలో ఎక్కువగా క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటున్నాం. అంటే ఐస్ క్రీమ్స్ లో గాని లేదా స్మూతి రూపంలో గాని, బిస్కెట్స్ లో, కొన్ని రకాల డిసేస్ లో అలాగే వీటితో పాటు కొన్ని షేక్స్ లో కూడా ఎక్కువగా క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఎలా క్రీమ్స్ ఉపయోగించడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేర్కొనడానికి కారణం అవుతుంది. ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరగడానికి, గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి ఇవి కారణం అవుతున్నాయి.

                       అలాగే శరీరంలో ఫ్యాట్ డిపాజిట్ పెరగడానికి ఇంకా చాలా రకాల అనారోగ్యాలు రావడానికి ఇవి కారణమవుతుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు ఉపయోగించేటప్పుడు కూడా పాలు ద్వారా గాని, బటర్ ద్వారా గాని వచ్చే క్రీమ్ కాకుండా కొబ్బరి పాల నుంచి వచ్చే క్రీమ్ ఉపయోగించుకోగలిగితే చాలా మంచిది. ఈ కొబ్బరి క్రీమ్ ను ఇంట్లో తయారు చేసుకుంటే మన ఇంట్లో చాలా వాటిల్లో ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఫ్రెష్ క్రీమ్ మనకు అందుబాటులో ఉంటుంది. ఈ కోకోనట్ క్రీమ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం.

                     దీనికి ముందుగా కొబ్బరికాయను తురుము కొనాలి. ఇలా తురుముకున్న కొబ్బరి తురుమును ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఏదైనా ఒక గుడ్డ సహాయంతో ఒక గిన్నెలోకి కొబ్బరి పాలను వడకట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోగ వచ్చిన కొబ్బరిపాలను తీసుకొని ఫ్రిజ్లో ఒక నాలుగు ఐదు గంటలసేపు ఉంచాలి. నిదానంగా కొబ్బరి పాల పైన ఒక లేయర్ లాగా తేలుతుంది. దానిని కోకోనట్ క్రీమ్ అంటారు. ఫ్రిజ్లోంచి తీసి కోకోనట్ క్రీమ్ విడిగా తీసుకోవాలి.

                       ఇలా తయారు చేసుకున్న క్రీమ్ ను ఐస్ క్రీమ్స్ తయారు చేసుకున్నప్పుడు, స్మూతీస్ తయారు చేసుకున్నప్పుడు, కొన్ని రకాల వంటలు చేసుకున్నప్పుడు, కొన్ని రకాల బేకింగ్ వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇలా బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటిలోనే ఉపయోగించుకోవచ్చు. కనుక ఇటువంటి వాటిలో వాడితే ఇది జీరో కొలెస్ట్రాల్ గనుక దీనివలన బ్రెయిన్ కి చాలా  మంచిది. ఇది మన తెలివితేటలకు, మేధాశక్తి పెంచడానికి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుంది…

Leave a Comment

error: Content is protected !!