is it good to drink coffee daily

కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా??

ఉదయాన్నే లేలేత సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ పొగలు కక్కుతున్న కాఫీ చేతుల్లోకి తీసుకుంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. స్టవ్ మీద మర్లుతున్నపుడే ఆ సువాసనకు ఒళ్ళంతా చురుగ్గా తయారైనట్టు ఉత్తేజం వస్తుంది. ఒక్కో గుక్క తాగుతూ ఆ కాఫీ ని ఆస్వాదిస్తుంటే హాయిగా అనిపిస్తుంది. అయితే చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయ్. అవి ఇప్పటివి కాదు ఎప్పటి నుండోఅందరిని తొలిచేస్తున్న ప్రశ్నలు. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు, కాఫీ వల్ల ఆరోగ్యం మంచిదే అని మరికొందరు చెబుతుంటారు. అయితే ఆ సందేహాలన్నిటికీ సమాధానమే ఇపుడు మీ ముందుకు తీసుకొచ్చా చదవండి మరి. నిజం తెలుసుకోండి.

కాఫీ లో కెఫిన్ ఉంటుందని అందరికి తెల్సినదే కెఫిన్ ఆరోగ్యానికి మంచిదికదాని కొందరి అభిప్రాయం, కాదు కాదు చాలా మంచిదని మరికొందరి వత్తాసు. మరి ఏది నిజం?? అందుకే కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది చదివితే తెలుస్తుంది. 

కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

◆ప్రతిరోజు కనీసం ఒకటి నుండి రెండు కప్పుల కాఫీ తీసుకుంటే కాఫీలో ఉన్న కెఫిన్ వల్ల గుండెపోటుకు దారితీసే ఎంజైములు నశిస్తాయి. కాబట్టి కాఫీ తీసుకోవడం మంచిదే అని చెప్పవచ్చు.

◆మన శరీరం లో రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం కాఫీలో ఉంటుంది. గాయాలు దెబ్బలు తగిలినపుడు కొందరిలో రక్తం చాలా తొందరగా గడ్డ కట్టే లక్షణాలు ఉంటాయి. అలాంటి వారు కాఫీ ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

◆ఉబ్బసం వ్యాధి ఉన్న వారు కాఫీని తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇందులో కెఫిన్ సమస్యను చక్కదిద్దే స్వభావం కలిగి ఉంటుంది.

◆కాఫీ కేవలం పాలతో తీసుకోవడం మనకు తెలుసు అయితే చాలా మంది బ్లాక్ కాఫీ అంటూ ఆకెవలం డికక్షన్ ను తాగుతుంటారు దీనివల్ల జలుబు, దగ్గు, అతినిద్ర, మూత్రసమస్యలు తగ్గుతాయి.

◆కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా  పనిచేస్తుంది, కెఫిన్ మెదడులో నరాలను ఉత్తేజితం చేసి చురుగ్గా మారుస్తాయి. దీనివల్ల ఆలోచనా సామర్థ్యము కూడా పెరుగుతుంది.

◆కాఫీలో ఉన్న కెఫిన్ కేంద్ర నాడీమండల వ్యవస్థ పై ప్రభావితం చూపిస్తుంది.  దీనివల్ల మెదడులో న్యూరో కెమికల్స్ తయారవుతాయి. ఫలితంగా ఏకాగ్రతను పెంచుతాయి.

◆కాఫీని రోజూ తీసుకునేవారిలో నరాలకు సంబంధించిన సమస్యలు దరిచేరవని నిపుణుల పరిశోధనలో వెల్లడైంది.

కాఫీ వల్ల ఆరోగ్యపరమైన నష్టాలు

◆కాఫీని ఎక్కువగా తాగే వారు కొందరు ఉంటారు. వీరు రోజుకు మూడుసార్లకు మించి కాఫీని తాగేస్తుంటారు. కాఫీ తాగడం కూడా వీరికి డ్రగ్స్ తరహాలో లాలవాటు అయిపోయి ఉంటుంది.

◆కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాలను కుదిస్తుంది. దీనివల్ల రక్తసరఫరా లో ఇబ్బందులు తలెత్తి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

◆కాఫీని ఎక్కువ తీసుకునేవారిలో జీర్ణశక్తి తగ్గిపోతుంది. జీర్ణాశయ సామర్థ్యము  తగ్గిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది

◆అందరూ ఉదయాన్నే పరగడుపున కాఫీ  తాగుతారు దీనివల్ల గ్యాస్ట్రిక్, అల్సర్, బిపి, గుండె సమస్యలు, కెఫిన్ ప్రభావం వల్ల నిద్రపట్టకపోవడం, కాఫీ వ్యసనంగా అలవాటైన వాళ్లలో తలనొప్పి మొదలైంది సమస్యలు వస్తాయి.

◆కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్ధాప్యం తొందరగా వస్తుంది. అంటే చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది.

◆పిల్లలకు కాఫీ అలవాటు చేస్తే పిల్లల్లో ఎదుగుదల నెమ్మదిస్తుంది. కాబట్టి పిల్లలను పాలు మంచిది. కాఫీ దూరం గా ఉంచడం ఉత్తమం.

◆పరగడుపున కాఫీ తాగడం వల్ల జీర్ణకోశంలో ప్రవేశించి రక్తంలో ఆక్సిజన్  స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది

చివరగా….

పైన చెప్పుకున్న విషయాన్ని బట్టి చూస్తే కాఫీ తాగడం మంచిదే అయినా అతిగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం తప్పవని తెలుస్తోంది కాబట్టి కాఫీ మంచిదే….. అతిగా తాగకుంటేనే సుమా ……..

Leave a Comment

error: Content is protected !!