is it good to drink sugar cane juice during summer

వేసవిలో చెరకు రసం తాగడం నిజంగా మంచిదేనా

వేసవి వచ్చేసింది. ఎండలు చంపడం మొదలెట్టాయి. శరీరాన్ని చల్లబరిచే పద్ధతులు బోలెడు వాటిని పాటించడం మొదలెడతాము. ముఖ్యంగా కూల్ డ్రింక్ షాపులు, ఐస్ క్రీమ్ పార్లర్ లు కిటకిటలాడతాయి.  కానీ అవన్నీ తాత్కాలిక స్వాంతన చేకూరుస్తాయి అంతే కాని శరీరాన్ని చల్లబరచపోగా ఇంకా డీహైడ్రేట్ అయ్యేందుకు దోహాధం చేస్తాయి. అందుకే సహజంగా శరీర వేడిని తగ్గించి వేసవి తాపాన్ని తీర్చే పానీయాలు కావాలి. వాటిలో మొదటి వరుసలో ఉండేది చెరకు రసం. తియ్యని మధురమైన రుచితో అద్భుతమైన ఈ చెరకు రసంలో పోషకాలు కూడా  పుష్కలంగా ఉంటాయి.వీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, థియామిన్, రిబోఫ్లేవిన్ మరియు అనేక అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఫ్లేవనాయిడ్లు మరియు పాలీఫెనోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండటం వల్ల శరీరానికి గొప్ప సాంత్వన చేకూరుస్తుంది.  చెరకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసేద్దాం మరి. 

 తక్షణ శక్తిని అందిస్తుంది.

 చెరకులో సహజంగా సుక్రోజ్ ఉండటం వల్ల  శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది, శరీరంలో  కోల్పోయిన చక్కెర స్థాయిలను తిరిగి పొందడానికి, శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం ద్వారా అలసటను తగ్గించి ఉల్లాసాన్ని ఇస్తుంది.  కదిలించడం కూడా ఉత్తమ ఎంపిక.

మూత్రసంబంధ సమస్యలు తగ్గిస్తుంది

  చెరకు రసం తాగడం వల్ల  మూత్ర నాళాల సంక్రమణ సమస్యలు తగ్గించుకోవచ్చు. అతిమూత్రం, మూత్రంలో మంట, మూత్రవిసర్జన కష్టంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నపుడు చెరకు రసాన్ని తాగడం వల్ల మంచి ఉపశమనం ఉండటమే కాకుండా సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాదు చెరకు రసం మూత్రంలో రాళ్లను కరిగించే లక్షణాలను కలిగి ఉంటుంది. 

 చెరకు రసంలో స్పూన్ నిమ్మరసం, అల్లం రసం, లేత కొబ్బరి నీరు కలిపి తాగడం వల్ల వడదెబ్బ మరియు మూత్ర సంబంధ సమస్యలు చాలా తొందరగా తగ్గిపోతాయి. 

 కామెర్లు నివారణ

 సాంప్రదాయ ఆయుర్వేదం ప్రకారం, చెరకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి అద్భుతమైన ఔషధం గా దోహదపడుతుంది.   చెరకు రసంలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి మరియు బిలిరుబిన్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.  చెరకు రసం కోల్పోయిన ప్రోటీన్లను భర్తీ చేస్తూ కాలేయ సంబంధిత సమస్యలు ఘోన్దరగా తగ్గిపోయేలా చేస్తుంది.  

 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

 చెరకు రసం తాగడం మంచి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.  ఇందులోని పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థ మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు నివారిస్తుంది,  మలబద్ధకానికి ఇది ఉత్తమ ఔషధం. 

 శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

 జ్వరసంబంధమైన జబ్బులతో బాధపడుతున్న వారికి  చెరకు రసం గొప్పగా పనిచేస్తుంది. శరీరం కోల్పోయే పోషకాలు భర్తీ చేయడం మాత్రమే కాకుండా నీరసం వల్ల కలిగే మూర్ఛ వంటి సమస్యలను తగ్గిస్తుంది.  ముఖ్యంగా పిల్లలలో చాలా తొందరగా ప్రోటీన్ నష్టం జరుగుతుంది. ఆ ప్రోటీన్ ను చెరకు రసం భర్తీచేస్తుంది

 చర్మ సంరక్షణ

 చెరకు రసం యొక్క ఆశ్చర్యకరమైన మరొక ప్రయోజనం.  ఇది మొటిమలతో పోరాడుతుంది, మచ్చలను తగ్గిస్తుంది, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది మరియు చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.  ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలలో ఒకటైన గ్లైకోలిక్ ఆమ్లం చెరకు రసంలో ఉంటుంది ఇది చర్మాన్ని కాంతివంతంగా  ఉంచడంలో దోహాధం చేస్తుంది

చివరగా…..

చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల వేసవిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడమే కాకుండా రోగనిరోధక శక్తిని, ఎముకలకు బలాన్ని, గాయాలు తొందరగా మానిపోయేట్టు ఇలా ఎన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే మధుమేహం ఉన్నవారు చేరకురసానికి దూరంగా ఉండాలి.

Leave a Comment

error: Content is protected !!